తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు తీస్తూ హిట్లు కొడుతున్నారు చిరంజీవి. అలాంటి చిరు తాజాగా వాల్తేర్ వీరయ్య తో సూపర్ హిట్ కొట్టారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్ వహించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్లోకి వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే గత కొంతకాలం నుంచి చిరంజీవి తనకి కథ చెప్పడానికి వచ్చిన కొంతమంది దర్శకులను చరణ్ కోసం కథలు సిద్ధం చేయమని అడుగుతున్నారని సమాచారం.
Advertisement
ఈ తరుణంలోనే చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత కూడా సినిమాల విషయంలో సలహాలు,సూచనలు ఇస్తూ ఉంటుందట. ఈ మధ్యనే సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ప్రకాష్ రాజ్ మరియు శ్రీకాంత్ లతో షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ ను కూడా నిర్మించింది. తాజాగా రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన సేనాపతిని డైరెక్ట్ గా ఓటీటి లలోనే విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ రెండు ప్రాజెక్టులు సుస్మితకు చెప్పుకోదగ్గ గుర్తింపు మాత్రం ఇవ్వలేదు.
Advertisement
అయితే తాజాగా సుస్మిత సంతోష్ శోభన్ హీరోగా, శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. ప్రశాంత్ కుమార్ డైరెక్షన్లో 96 ఫేమ్ గౌరీ కృష్ణ హీరోయిన్గా చేసింది.ఈ సినిమాను ఫిబ్రవరి 18న థియేటర్లోకి విడుదల చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి చిరు ఎలాంటి సపోర్ట్ చేయడం లేదట. చిన్న సినిమాలకు సపోర్ట్ ఇచ్చే చిరు తన సొంత కూతురుకు మాత్రం పెద్దగా సపోర్ట్ చేయడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.. దీనికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.
also read: