మెగాస్టార్ చిరంజీవి నేడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు సహాయ సహకారాలు అందిస్తున్న వారితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మరోసారి మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ సమస్యలపై స్పందించడం పై రియాక్ట్ అయ్యారు. ప్రతి సమయంలో సైలెంట్ గ ఉండడం కరెక్ట్ కాదు…నేను స్పందించాలి..నా అభిమానులే నా స్పందన నా సైన్యం మీరే…నా తమ్ముడు కల్యాణ్ బాబు సమస్యలపై పోరాడతాడు.
కల్యాణ్ బాబు ఏదైనా విషయం పై మాట్లాడుతుంటే అది కరెక్ట్ అనిపిస్తుంది. పవన్ న్యాయం కోసమే పోరడతాడు నేను కూడా న్యాయం కోసమే పోరాడతాను..కానీ నేను సమయం తీసుకుంటాను. నా సిన్సియారిటీ, నేను నిజాయితీగా స్పందించాలి. ఆ విషయంలో నేను ఎవరి చేతా మాటపడలేను. అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా నిన్న ఆదివారం మెగాస్టార్ షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
also read : RADHESHYAM FIRST REVIEW : రాధేశ్యామ్ ఫస్ట్ రివ్య్వూ వచ్చేసింది..సినిమా ఎలా ఉందంటే..?
తాను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించను అని పెద్దరికం అనే హోదా తనకు వద్దని మెగాసస్టార్ అన్నారు. కావాలంటే ఏదైనా సమస్య బాధ్యత తీసుకుంటానని…సినిమా పరిశ్రమకు ఇబ్బందులు ఉంటే తాను భుజం కాయడానికి సిద్దంగా ఉన్నానని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా యూనియన్లలో ఇద్దరు గొడవలు పడి పంచాయితీ పెట్టుకుని తన వద్దకు రావద్దని అన్నారు. దాంతో మెగాస్టార్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.