Home » RADHESHYAM FIRST REVIEW : రాధేశ్యామ్ ఫ‌స్ట్ రివ్య్వూ వ‌చ్చేసింది..సినిమా ఎలా ఉందంటే..?

RADHESHYAM FIRST REVIEW : రాధేశ్యామ్ ఫ‌స్ట్ రివ్య్వూ వ‌చ్చేసింది..సినిమా ఎలా ఉందంటే..?

by AJAY
Ad

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్. బాహుబ‌లి, సాహో లాంటి పాన్ ఇండియా చిత్రాల త‌ర‌వాత పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీతో వ‌స్తున్నాడు. ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ‌హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా ఈ సినిమాలో రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ ల‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమా ట్రైల‌ర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

RADHESHYAM FIRST REVIEW

RADHESHYAM FIRST REVIEW

ఇక సినిమా కూడా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ముంబాయి, ఢిల్లీలో సినిమా థియేటర్లు మూత‌ప‌డ్డాయి. ప‌లు రాష్ట్రాల్లో యాబై శాతం సీటింగ్ ప‌రిమితం చేసారు. దాంతో ఇప్పుడు రాధే శ్యామ్ కూడా వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

ALSO READ : లైవ్ లో దీప్తి ఎమోష‌న‌ల్…గుండె ప‌గిలిపోయిందంటూ ష‌ణ్ముక్ పోస్ట్..!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూ కూడా వ‌చ్చేసింది. దుబాయ్ లో ప్ర‌తి సినిమాను చూస్తూ ఆ సినిమా రివ్యూను సోష‌ల్ మీడియాలో షేర్ చేసే సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు ఉమైర్ సాధు రాధే శ్యామ్ సినిమాను కూడా ఈ రోజు చూసినట్టు షేర్ చేశారు. అయితే సినిమా గురించి గొప్ప‌లు చెప్ప‌కుండా ఒక్క‌మాట‌లోనే రివ్య్వూను పూర్తి చేశాడు. సినిమా ట్రైల‌ర్ కంటే చాలా చాలా చాలా బెట‌ర్ గా ఉంద‌ని ఉమైర్ పేర్కొన్నాడు. ఇక ట్రైల‌ర్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అర్థం చేసుకోవ‌చ్చు.

Visitors Are Also Reading