మెగాస్టార్ చిరంజీవి తెలుగు వెండి తెరపై తిరుగులేని మహారాజు. ఆయనకు టాలీవుడ్‌లో తిరుగులేదు ఎలాంటి సినిమాలు అయినా అలవొకగా చేయగలడు. కానీ ఆయనను ఒక హరోయిన్ ఇబ్బంది పెట్టిందని చాలా మందికి తెలియదు. ఆమె ఎవరో కాదు శ్రీదేవి. ఒకప్పుడు తెలుగు తెర అందాల రాణి చిరంజీవి శ్రీదేవి కలిసి మొదటిసారిగా మోసగాడులో కలిసి నటించారు. ఇద్దరి కాంబినేషన్‌లో ఒక పాట కూడా ఉంటుంది. ఆ తరువాత రాణి కాసుల రంగమ్మ, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరుశురామ్ వంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇక నుంచి కాస్తా కథ అడ్డం తిరిగింది. 1980లో వీరిద్దరూ లీడింగ్‌లో ఉన్న సూపర్ స్టార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ముందు వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి ఎంతో డైరెక్టర్స్ ప్రయత్నించారు. చిరంజీవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ శ్రీదేవి టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో దుమ్ముదులుపుతుంది. సక్సెస్ ఇచ్చి మత్తులో పాత పెద్ద హీరో అయినా తను చెప్పే మార్పులు చేయాలి రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వాలి. హీరో ఓరియేంటెడ్ కథా అయినా పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలి. అని కండీషన్స్ పెడుతూ నిర్మాతలను నానా విధాలుగా ఆడుకునేది.
Advertisement
Advertisement
అలా శ్రీదేవి కండీషన్లకు ఒకే చెప్పి మరీ కొన్ని చిత్రాలు చేసినా కొన్ని పట్టాలెక్కకుండా మరుగున పడిపోయాయి. అందులో ఒక సినిమా వజ్రాల తోక ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా ఓ సినిమా తెరకెక్కడానికి సిద్దమవుతోంది. దానిని శ్రీదేవి నిర్మిస్తానని చెప్పింది. అయితే కథ దగ్గర పేజీ వచ్చింది. తమ నిర్మాత కాబట్టి ఇందులో తన పాత్రకు హీరో పాత్ర కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని కండీషన్ పెట్టారు. దానికి చిరంజీవి ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.
ఆ తరువాత కొండవీటిదొంగ అనే సినిమా ప్లానింగ్ జరుగుతోంది. దానికి హీరోయిన్‌గా శ్రీదేవిని ఫిక్స్ చేశారు. ఏ.కోదండరామిరెడ్డి. కథంతా విన్న శ్రీదేవి టైటిల్ పేరు మార్చాలని కొండవీటి రాణి కొండవీట దొంగ రాయమంది. ఇందులో తన పాత్ర తో సమానంగా హీరో పాత్ర ఉండాలి. హీరో ప్రేమ, ప్రేమ అంటూ తన చుట్టూ తిరగకూడదు అని కండీషన్స్ పెట్టింది. దాంతో ఇక్కడ కూడా చిరంజీవికి కోపం వచ్చింది. ఈ సినిమా ఆగిపోయింది.
ఈ ఘటన జరిగిన రెండేండ్లకు కొండవీటి దొంగ సినిమా విజయశాంతి, రాధా ఇద్దరూ కలిసి కథానాయికలుగా మార్పు చెంది తెరకెక్కింది. సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా వచ్చిన రెండు నెలలకు విడుదల జగదేక వీరుడు అతిలోక సుందరి దగ్గర కూడా శ్రీదేవీ పేచీ పెట్టింది. తొలుత ఈ సినిమాకు జగదేక వీరుడు అని టైటిల్ పెట్టారు. దానికి కూడా శ్రీదేవి అడ్డు చెప్పడంతో అతిలోక సుందరి యాడ్ చేసి సినిమా తెరకెక్కించారు. శ్రీదేవి అలా అడ్డుపడడంతో చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు సినిమాలు ప్రారంభంలోనే ఆగిపోయాయి.
Also Read : సామాన్యులకు మరొక షాక్.. భారీగా పెరగనున్న బిస్కెట్ ధరలు..!