Home » రాజమౌళితో అందుకే సినిమా చెయ్యను అంటున్న చిరు..!

రాజమౌళితో అందుకే సినిమా చెయ్యను అంటున్న చిరు..!

by Azhar
Ad
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను నేషనల్ స్థాయిలో పెంచేశారు. అలాగే ఈ సినిమాతోనే పాన్ ఇండియా అనే ట్రెండ్ ను అందరికి పరిచయం చేసారు. అలాంటి జక్కనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్స్ కూడా సిద్ధంగా ఉంటారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం నేను రాజమౌళితో సినిమా అనేది చేయను అని గతంలో కామెంట్స్ చేసాడు.
కానీ తాను ఆ కామెంట్స్ ఎందుకు చేశాను అనే విషయాన్ని చిరంజీవి తాజాగా వివరించాడు. అయితే ఇప్పుడు చిరంజీవి గాడ్ ఫాథర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 5న ఆ సినిమా విడుదల కానుండటంతో దాని ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు చిరు. ఇక తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళితో సినిమా ఎందుకు చెయ్యను అన్నారు అని ప్రశాం వచ్చింది.
ఇక దానికి సమాధానం అనేది ఇచ్చిన చిరు.. రాజమౌళి తన సినిమాలతో మన టాలీవుడ్ నే కాదు ఇండియా సినిమానే ప్రాపంచం ముందు ఉంచారు. అయితే ఆయన ఒక్క సినిమా అనేది ప్రారంభిస్తే కనీసం 5 ఏళ్లకు పూర్తి అవుతుంది. అప్పటివరకు ఆ హీరో మరో సినిమా చేయలేడు. కానీ నేను ఏడాదికి మూడు సినిమాలు అయిన చెయ్యాలి అని అనుకుంటున్నాను. అందుకే రాజమౌళికి నాకు సెట్ కాదు అని చిరు అన్నారు.

Advertisement

Visitors Are Also Reading