చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. అయితే ఈ సినిమా అనేది ఈ ఏడాది విడుదల అయ్యి పెద్ద డిజాస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. కానీ విడుదలకు ముందు దీని పై చాలా హైప్ అనేది ఉంది. అందుకు కారణం చిరు. చరణ్ కలిసి కొరటాల శివ డైరెక్షన్ లో చేయడం వల్ల భారీ అంచనాలు అనేవి ఈ సినిమా పై ఏర్పడ్డాయి.
Advertisement
కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కాగా.. మొదటిసారి ఆచార్య ప్లాప్ పై చిరంజీవి నేరుగా స్పందించారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో ఉన్నా చిరు ఆచార్య గురించి మాట్లాడుతూ.. నాకు ఆచార్య ప్లాప్ అయ్యినందుకు బాధ అనేది లేదు. ఎందుకంటే సినిమాలో చేసేటప్పుడు అందరూ తన పూర్తి ఎఫట్స్ అనేవి పెడుతారు. ఇక సినిమా రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు.
Advertisement
ఇక ఈ సినిమాలో మేము మొత్తం కొరటాల చెప్పిన విధంగానే చేసాము అని చిరు అన్నారు. అలాగే ఆచార్య విషయంలో ఉన్నా ఒకే బాధ ఏంటి అంటే.. ఇందులో నేను చరణ్ కలిసి నటించిన ఇది ప్లాప్ కావడం. అయితే భవిష్యత్ లో మళ్ళీ ఎప్పుడైనా మేము కలిసి నటిస్తే ఈ సినిమాను వచ్చిన హైప్ అనేది రాదు అని చిరు అన్నారు. అయితే ఆచార ప్లాప్ తో ఇప్పుడు చిరు ఆశలు అన్ని గాడ్ ఫాథర్ పైనే ఉన్నారు అనేది తెలిసిందే.
ఇవి కూడా చదవండి :