Home » గంగోత్రి సినిమాలో చిన్న పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..?

గంగోత్రి సినిమాలో చిన్న పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లుర్జున్ తొలి సినిమాలో గంగోత్రిలో వ‌ల్లంకి పిల్ల పాట‌లో చిన్న‌ప్ప‌టి క‌థానాయిక‌గా క‌నిపించిన అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ వ‌స్తే కానీ అన్నం తిన‌ను అని.. అల్లు అర్జున్ పాట పాడితే కానీ నిద్ర‌పోని పాత్ర‌లో కావ్య అద్భుతంగా న‌టించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చిన కావ్య ఎంతో మంది హీరోల సినిమాల్లో న‌టించింది. చిరంజీవి ఠాగూర్‌, బాల‌కృష్ణ విజ‌యేంద్ర వ‌ర్మ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ బాలు ఇలా ప‌లు సినిమాల్లో చైల్డ్ ఆర్టీస్ట్‌గా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది.

Gangotri Movie Child Artist Kavya Kalyanram Real Life Story In Telugu - Sakshi

Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్‌గా అర‌డ‌జ‌న్ సినిమాల్లో న‌టించిన కావ్య తెలుగు, మ‌ళ‌యాళ సినిమాల్లో ఆడిష‌న్స్ ఇస్తోంది. త్వ‌ర‌లో క‌థానాయిక‌గా అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ త‌రుణంలోనే అప్పుడ‌ప్పుడు ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేస్తూ.. నెటిజ‌న్లను థ్రిల్ చేస్తుంది. తాజాగా క‌రోనా నేప‌థ్యంలో మాస్క్ పెట్టుకుని క‌నిపించింది కావ్య‌.

Advertisement

గంగోత్రి సినిమా లో వల్లంకి పిట్ట పాట లో ఉన్న ఆ చిన్న పాప ఇప్పుడెలా ఉందో చూడండి

పుణేలో లా పూర్తి చేసిన కావ్య ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టింది. ఈమె సినిమా ఎంట్రీకి లాక్‌డౌన్ కూడా కార‌ణ‌మ‌ని అంటున్నారు. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండే ఇంట్రెస్టింగ్ ఛాలెంజింగ్ పాత్ర‌లంటే త‌న‌కు చాలా ఇష్టం అంటుంది కావ్య‌. ఓటీటీలో డిఫరెంట్ స‌బ్జెక్ట్ వ‌స్తున్నాయి. అలాంటి అవ‌కాశం నాకు వ‌చ్చి పాత్ర ఆస‌క్తిగా అనిపిస్తే చేస్తాన‌ని చెప్పుకొచ్చింది కావ్య‌.

Also Read: పిల్ల‌ల‌కు ఉండే ఈ అలవాట్ల ప‌ట్ల నిర్ల‌క్ష్యం చేస్తే త‌ల్లిదండ్రులు విఫలమే..!

Visitors Are Also Reading