మానవులు రోజు వారి కార్యక్రమాలలో భాగంగా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. మనిషి యొక్క జీవితంలో అలవాట్లు అనేవి ఎంతో ముఖ్యమైనవి. అంతేకాకుండా మన అలవాట్ల మీద వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లను ఖచ్చితంగా పాటించాలి. ఉదయం లేచిన వెంటనే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పతివ్రతలైన ద్రౌపది, కుంతీ, తార, మండోదరి పేర్లను తలచుకుంటూ లేవాలి. వీరిని పంచకన్యలు అంటారు.
Advertisement
లేచిన వెంటనే వీళ్ళని తలచుకుంటే ఎంతో శుభం జరుగుతుంది. దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా లేచిన వెంటనే రెండు చేతులను కళ్ళ మీద పెట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరములే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా శుభాలు జరుగుతాయి. అంతేకాకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతారు. నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. లేచిన వెంటనే మొదటి అడుగు వేయగానే భూదేవికి నమస్కారం చేసుకోవాలి.
Advertisement
కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు లేచిన తర్వాత మొబైల్ ఫోన్ ని చూడడం అలవాటుగా మారిపోయింది. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. లేచిన వెంటనే వారి పనులు చేసుకోకుండా ఫోన్ పట్టుకొని అలాగే మంచానికి అతుక్కుపోతారు. ఉదయం లేచాక ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని స్నానం చేసిన అనంతరం ఇంట్లో ఉన్న భగవంతుడిని పూజించాలి. ఆ తర్వాత పనులు చేసుకోవాలి. గోవుకి ఆహారం పెట్టడం కూడా మంచి మేలు కలిగిస్తుంది. ధర్మశాస్త్రాల్లో పండితులు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆవును పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్లే.. కనుక ప్రతిరోజు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి ఇంట్లో అష్టైశ్వర్యాలతో, ఆనందంతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయని ఏకైక మొనగాడు ?
మీ కనుబొమ్మలు ఇలా ఉన్నాయా? అయితే మీరు ధనవంతులు అవుతారు…!
దగ్గుబాటి రానా భార్య మిహికా బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!