దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోయింది. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రజలతో పాటూ సెలబ్రెటీలు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. కొంతమంది హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటే మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు.
Advertisement
Advertisement
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వల్ప లక్షణాలు ఉన్నాయని పేర్నొన్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం తాను వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా నిన్నటి రోజున టీడీపీ నేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన సైతం హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.