Home » పవన్ కళ్యాణ్ కి 70 సీట్లు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!

పవన్ కళ్యాణ్ కి 70 సీట్లు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anji

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కుప్పం పర్యటన లో ఉన్నారు. మూడు రోజుల పాటు కుప్పంలో  పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సినిమా అయిపోయిందని.. ఆ పార్టీ ఇంకా 100 రోజులు మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు సొంత కుటుంబం లాంటి వారని, ఇక్కడి ప్రజలు 35 ఏళ్లుగా తనని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమాభిమానాలు అందించారని అన్నారు.

 ఈసారి ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం గర్వం పడే విధంగా ఇన్నేళ్లుగా గెలిపించారు. ఈ ప్రభుత్వంలో నాలాంటి వాడికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలీసులు ముందుకు రావాలి అని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ఇంతవరకు ఏ గ్రామంలో రోడ్డు కూడా వేయలేదని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఐదేళ్లలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గొడవలు దాడులు జరుగుతున్నాయి. కుప్పంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉంది అని ప్రజలను ప్రశ్నించారు.

వైసీపీ పై ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను అని అన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎమ్మెల్యే, ఎంపీలను మారుస్తాను అంటున్నాడు కానీ వారికి దొంగ బుద్ధులు నేర్పింది జగనే కదా అని ఎద్దేవా చేశారు. జగన్ సహకరించనిదే ఎమ్మెల్యేలు ఎంపీలు రౌడీయిజం చేశారా అని అన్నారు. సంక్షేమ పథకాలతో మోసపోవద్దని చెప్పారు. ఎక్కడ చూసినా వై.యస్.జగన్మోహన్ రెడ్డి దోపిడి మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. సాండ్, ల్యాండ్ లలో స్కామ్లు చేసి ప్రజలను దోచుకుంటున్నాడు అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతి రాజకీయం చేశాడని చంద్రబాబు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే టీడీపీ జనసేన తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా వైయస్సార్ సీపీ పై గెలవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమిగా ఏర్పడి శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading