ఆచార్య చాణక్యుడి గొప్పతనం గురించి అందరికీ తెలిసినదే. ముఖ్యంగా మనిషి జీవించే విధానం.. ఆనాటి కాలంలోనే ఈ నాటి గురించి వివరించారు. అందులో ఓ వ్యక్తి అలవాట్లను బట్టే మంచి, చెడు అని నిర్ణయిస్తారు. మంచి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ప్రజలకు స్పూర్తిగా నిలవడమే కాకుండా గౌరవం.. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తప్పుడు అలవాట్లను కలిగిన వ్యక్తి తన జీవితాన్నీ తానే స్వయంగా నాశనం చేసుకున్న వాడవుతాడు. చాణక్య నీతి పుస్తకంలో అలాంటివి కొన్ని అలవాట్లను పేర్కొన్నాడు.
Advertisement
ఒక వ్యక్తి చెడు అలవాట్లను కలిగి ఉంటే లక్ష్మిదేవి అనుగ్రహాన్ని పొందలేడు. దీంతో కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. పేదరికం ఉంటుంది. ఎవరైనా జీవితంలో ఆనందం, సంపదను పొందాలనుకుంటే కొన్ని అలవాట్లను పెంపొందించుకోవాలి. అవి ఏమిటంటే..?
రోజు దైవాన్ని స్మరించే అలవాటు పూజ చేయడం వల్ల మనిషి ఆలోచనలు మంచి వైపు మరలుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతీ వ్యక్తి పూజలు చేయాలి. నిత్య పూజ జరగని ఇంట్లో ప్రతికూల పరిస్తితులు ఏర్పడుతాయి. అటువంటి వారి ఇంట్లో లక్ష్మిదేవి ఎప్పుడు ఉండదు.
Advertisement
లక్ష్మిదేవి ఎప్పుడు పరిశుభ్రతనే ఇష్టపడుతుంది. విడిచిన బట్టలు ధరించే వారు, పళ్లు శుభ్రం చేసుకోని వారు ఇంటిని మురికిగా ఉంచేవారు, ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి ఎప్పుడు నివసించదు. అటువంటి వారు ఎప్పుడు రోగాల బారిన పడతారు. అంతేకాదు. ధన నష్టాన్ని కూడా పొందుతారు. కనుక ఎల్లప్పుడూ లక్ష్మిదేవి అనుగ్రహం పొందాలంటే.. ఇల్లు, శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఎవరి ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయో.. అటువంటి వాతావరణం ఉండే ఇంటి పట్ల కూడా లక్ష్మిదేవి అసంతృప్తిగానే ఉంటుంది. అలాంటి వారి ఇంటిపై లక్ష్మిదేవి అనుగ్రమం ఉండదు. ఎవరైనా లక్ష్మిదేవి అనుగ్రమం పొందాలనుకుంటే కుటుంబంలో ప్రేమ, స్నేహ పూర్వక వాతావరణం ఉండేవిధంగా చూసుకోవాలి.
పెద్దలతో అమర్యాదగా ప్రవర్తించేవారు వృద్ధులను అవమానించే వారు, నిస్సహాయులను వేధించే వారిపై కూడా లక్ష్మిదేవి ఆగ్రమం వ్యక్తం చేస్తుంది. వారి ఇంట్లో సమస్యల వలయం కొనసాగుతూనే ఉంటుంది. ఆనందానికి తావు ఉండదు. వృద్ధులను, పెద్దలను గౌరవించడం అలవరుచుకోవడం ఉత్తమం.