చాణక్య మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకి కూడా చక్కటి పరిష్కారాన్ని చాణక్య నీతి ద్వారా ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు మనం చేయడం వలన ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి. అయితే మనతో రోజూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు చాలా మందితో మనం రోజు కలిసి సమయాన్ని గడపాల్సి వస్తుంది. అయితే, వాళ్లలో కొందరు స్నేహితులు ఉంటారు కొందరు శత్రువులు ఉంటారు ఈరోజుల్లో చాలామంది మనసులో భావాలని బయట పెట్టకుండా నటిస్తున్నారు. దాంతో స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరిని కనుక్కోవడం పెద్ద సమస్య అయింది. మిమ్మల్ని ప్రోత్సహించేవారు మీకు తోడుగా ఉండే వాళ్ళు మీకు స్నేహితులు.
Advertisement
Advertisement
మీ యొక్క విజయాన్ని చూసి ఏడ్చేవాళ్ళు శత్రువులు. అయితే, కొంతమంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు మంచిగా మాట్లాడి వెనుక చెడ్డగా మాట్లాడితే అలాంటి వారిని అస్సలు మీ జీవితంలో ఉంచుకోవద్దు. వాళ్ళని వదిలేయడం మంచిది. అదేవిధంగా మీ రహస్యాలని ఇతరులతో చెబుతున్నట్లయితే వాళ్లతో కూడా స్నేహం చేయకండి. మీ కష్టసుఖాలు తెలిసిన వాళ్ళు, ఆనందంగా ఉన్నప్పుడు బాధగా ఉన్నప్పుడు కూడా వెనక ఉండేవారు నిజమైన స్నేహితులు. అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకండి. ఏదైనా సమస్యలో చిక్కుకుంటే తోడుగా ధైర్యం చెప్పేవాడు నిజమైన స్నేహితుడు.
Also read:
- మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు.. తెలుసా..?
- ఆదిపురుష్,బ్రో మొదలు ఎక్కువ నష్టాలని.. తెచ్చిన సినిమాలు ఇవే..!
- విమానాల్లో వెళ్ళేటప్పుడు ఈ వస్తువులని.. అస్సలు తీసికెళ్ళకండి..!