Home » CHANAKYA NITI : మీరు నమ్మే వ్యక్తులకు ఈ 4 లక్షణాలు ఉన్నాయో లేదో చూడండి

CHANAKYA NITI : మీరు నమ్మే వ్యక్తులకు ఈ 4 లక్షణాలు ఉన్నాయో లేదో చూడండి

by Anji
Ad

మనిషి జీవితంలో ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలను చాణక్య నీతి ద్వారా చెప్పాడు. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో వివరించాడు. ఆచార్యచాణక్యుడి ప్రకారం.. ముఖ్యంగా బంగారాన్ని సానపట్టాలి, కత్తిరించాలి. అగ్నిలో వేడి చేసి పరీక్షించాలి. అదేవిధంగా మనం మరో వ్యక్తిని విశ్వసించే ముందు లేదా స్నేహం చేసే ముందు ఈ నాలుగు విషయాలను తప్పకుండా పరిశీలించాలని సూచించాడు. 

chanakya-niti

chanakya-niti

మనం ఇతరులతో స్నేహం చేసేటప్పుడు వారిలో త్యాగం చేసే గుణం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. త్యాగగుణం ఉన్న వారు ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇతరుల సంతోషం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. 

Advertisement

మంచి స్వభావం గల వ్యక్తితో స్నేహం చేయడం ద్వారా మనకు భద్రతా భావాన్ని ఇస్తుందని చాణక్యనీతిలో చెప్పాడు. మంచి స్వభావం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు భావాలను కలిగి ఉండడు. అలాంటి వ్యక్తులను నమ్మవచ్చు. 

Advertisement

నమ్మకస్తుడా కాదా.. కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, అబద్దం వంటి చెడు లక్షణాలు లేని వ్యక్తులను మీరు నమ్మవచ్చు. ఈ లక్షణాలు లేని వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు.

 పనులపై నిఘా వ్యక్తిని అంచనా వేయడానికి ఆ వ్యక్తి చేసేటటువంటి పనులపై మీరు శ్రద్ధ వహించాలి. తప్పుడు పనులు చేసే వారిని మాత్రం అస్సలు నమ్మకూడదు. తప్పుడు పనులు చేసేవారు సమయం దొరికినప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి వెనకాడరు. అందుకే సత్కార్యాలతో నిమగ్నమైన వ్యక్తితో స్నేహం చేయాలి. ఒక వ్యక్తి సంబంధాన్ని పెంచుకున్నప్పుడు లేదా ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు ఈ అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

CHANAKYA NITI : స్త్రీలలో ఈ 4 లక్షణాలు ఉండకూడదు.. తనకే కాదు.. తాను వెళ్లిన కుటుంబానికి కూడా..!

 CHANAKYA NITI : ఈ ఐదు రకాల వ్యక్తులకు దూరంగా ఉండటం ఉత్తమం.. లేదంటే నరకం చూస్తారు..!

Visitors Are Also Reading