Home » Chanakya Niti : మీ ప్రేమ పదిలంగా ఉండాలంటే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

Chanakya Niti : మీ ప్రేమ పదిలంగా ఉండాలంటే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

by Anji
Ad

సాధారణంగా భార్యభర్తల బంధం చాలా బలంగా ఉంటే జీవితాంతం సుఖ, సంతోషాలతో సాగే అవకాశముంది. ఇద్దరిలో ఎవ్వరూ ఏ తప్పులు చేసినా భార్య, భర్త కలిసి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భార్యభర్తలు ఒకరి ప్రవర్తన మరొకరికి ఇబ్బందికరంగా ఉండేవిధంగా నడుచుకోకూడదు. ముఖ్యంగా ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోతే దంపతుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఒక వ్యక్తి తన స్నేహితుడిని ఎంచుకునే ముందు అతని స్వభావాన్ని, మాట తీరుని సరిగ్గా పరిశీలించాలి. నిజమైనస్నేహితుడు నమ్మదగినవాడు, సద్గుణవంతుడై ఉండాలి. చాణక్యుడి ప్రకారం.. మంచి స్నేహం వ్యక్తిత్వాన్ని అభి వృద్ధి చేస్తుంది. అతడి విజయంలో అది కూడా పెద్ద పాత్రనే పోషిస్తుంది. మీ స్నేహంలోని విభిన్న కోణాల గురించి చెబుతుంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  ఈ జ్యూస్ తాగితే మీ నరాలకు శక్తి రావడం పక్కా..!

Advertisement

పరస్పర గౌరవం :

Advertisement

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. సంబంధంలో గౌరవం చాలా ముఖ్యం. ఇతరులను గౌరవంగా చూడాలి. ప్రతిఫలంగా అదే ఆశించాలి. గౌరవం సంబంధాల్లో సామరస్యాన్ని, అవగాహనను, ఆలోచనల ఆరోగ్యకరమైన మార్పిడిని పెంపొందిస్తుంది.  

Also Read :  నెయిల్ కట్టర్ లో ఆ రెండు చిన్న కత్తులు ఎందుకుంటాయో తెలుసా ?

నిజాయితీ, పారదర్శకత :

సంబంధాలలో నిజాయితీ, పారదర్శకత ఉండాలని చాణక్యుడు సూచించారు. మోసం, అబద్దాలు బంధాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటారు. మీ భాగస్వామి, ప్రియమైన వారితో నిజాయితీగా, పారదర్శకంగా ఉండడం వల్ల వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు బంధం బలపడుతుంది. 

కమ్యూనికేషన్ :

సంబంధాలను పెంపొందించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ చాలా అవసరం. స్పష్టమైన,బహిరంగ సంభాషణ అవసరాన్ని నొక్కి మరీ చెప్పారు. ఆలోచనలు, భావాలు, ఆందోళనలను బహిరంగంగా వ్యక్త పరచాలని సూచించారు. ఇద్దరి మధ్య అవగాహనకు దారి తీస్తుంది. అపార్థాలను తొలగిస్తుంది.  

Also Read : నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Visitors Are Also Reading