Home » నటించిన తొలి సినిమాతోనే.. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ కపుల్స్ వీళ్ళే..!

నటించిన తొలి సినిమాతోనే.. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ కపుల్స్ వీళ్ళే..!

by Sravya
Ad

ఈమధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు విడిపోతున్నారు ఇదివరకు మాత్రం హీరో హీరోయిన్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు జోరు బాగా పెరుగుతూ ఉంది. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే మొదటి సినిమాతోనే ప్రేమలో పడి ఎవరికీ తెలియకుండా ఏళ్ల పాటు డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు.

tollywood-couples

Advertisement

కొంతమంది విడిపోయారు కానీ ఇంకా చాలా మంది కలిసే ఉన్నారు. 1987లో తలంబ్రాలు సినిమాలో మొట్టమొదటిసారి రాజశేఖర్ జీవిత కనపడ్డారు ఈ సినిమాతో వీళ్ళ ఫ్రెండ్షిప్ బానే సాగింది తర్వాత ప్రేమలో పడ్డారు ఒకరికి ఒకరు నచ్చడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళు కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

అలానే టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ ఊహ శ్రీకాంత్ ఆమె అనే సినిమాతో మొదటిసారి పరిచయం అయ్యారు. తర్వాత ప్రేమలో పడ్డారు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు నమ్రత వంశీ సినిమాతో వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు చాలా కాలం పాటు రహస్యంగా డేటింగ్ చేశారు. 2004లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా కలిసి ఉంటున్నారు.

Advertisement

Mahesh – Namratha

Mahesh – Namratha

నాగచైతన్య సమంత ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారి కనబడ్డారు తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు నాలుగేళ్లు కూడా తిరగకుండా ఇద్దరు విడిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కూడా విడిపోయారు వీళ్లిద్దరూ బద్రి సినిమాతో మొట్టమొదట కలిసి నటించారు. తర్వాత ప్రేమలో పడ్డారు. రేణు దేశాయ్ ఏకంగా పవన్ కళ్యాణ్ కోసం కెరియర్ ని పణంగా పెట్టింది. అతనితో జీవితాన్ని మొదలు పెట్టింది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

Amala about Akkineni Nagarjuna

Amala about Akkineni Nagarjuna

తర్వాత విడాకులు తీసుకున్నారు. నాగార్జున అమల 1987లో కిరాయి దాదా సినిమాతో కలిసి నటించారు. తర్వాత కొన్నాళ్ళు పాటు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు. రాజా వారు రాణి వారు సినిమాలో కిరణ్ సబ్బవరం రహస్య మొదటిసారి నటించారు వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading