పిల్లలను కనేందుకు వయసుతో సంబంధం లేదంటున్నారు సెలబ్రెటీలు. అరవై ఏళ్ల వీకే నరేష్ రీసెంట్ గా తాను సహజీవనం చేస్తున్న పవిత్ర తాను పిల్లలను కనేందుకు ఫిట్ గానే ఉన్నామంటూ కామెంట్ చేశాడు. అయితే నరేష్ కంటే మందు కొంతమంది తారలు లేటు వయసులో పిల్లలకు జన్మనిచ్చారు. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
Advertisement
టాలీవుడ్ హీరో కృష్ణం రాజు కు మొదట కూతురు పుట్టింది. ఆ తరవాత కుమారుడి కోసం ఎదురుచూశారు కానీ మళ్లీ కూతురే జన్మించింది. ఆ తరవాత కృష్ణంరాజుకు 56 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మరో కూతురు జన్మించింది.
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో 50 ఏళ్లు పై బడిన తరవాత అమీర్ ఖాన్ లేటు వయసులో పిల్లలను కన్నారు.
హీరో శరత్ కుమార్ రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. 2001లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా 2004లో వీరికి రాహుల్ అనే బాబు జన్మించాడు.
Advertisement
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూదేశాయ్ తో విడాకులు తీసుకున్న తరవాత 46 ఏళ్ల వయసులో అన్నా లెజొనోవాను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే వీరిద్దరూ డేటింగ్ లో ఉండటంతో లెజొనోవా పవన్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
ప్రకాష్ రాజ్ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆ తరవాత పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు. పోనీవర్మ బాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కాగా వీరిద్దరూ పెళ్లి తరవాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. నిర్మాత దిల్ రాజు భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తేజశ్విని అనే మహిళను దిల్ రాజు యాబై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరవాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు.
ALSO READ : హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!