మన హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టిన నుంచి చావు వరకు ప్రతి ఒక్క దానికి జ్యోతిష్య శాస్త్రంతో ముడిపడి ఉంది. ప్రతి దాన్ని శాస్త్రంతో కొలుస్తారు. సాధారణంగా మనిషి పుట్టినప్పుడు కూడా వేదమంత్రాలతో వివిధ పూజలు చేస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత పెద్దకర్మ రోజు కూడా పూజలు చేస్తూ వివిధ మంత్రాలను చదువుతారు. అలాంటిది నిద్ర పట్టడానికి కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయట. ఈ మంత్రం జపిస్తే ఇట్టే నిద్ర పడుతుందట.. అదేంటో పూర్తిగా తెలుసుకుందామా.. ఏ మనిషికైనా నిద్ర చాలా అవసరం.
also read:అంత్యక్రియల అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?
Advertisement
also read:ఈ రాశుల అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి.. గయ్యాళి భార్యలుంటారు!
Advertisement
ఒక్కరోజు నిద్ర కరువైన ఆ మరుసటి రోజు చికాకుగా, నీరసంగా ఉంటారు. నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి .ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడి గురై రాత్రిపూట నిద్రపోవడం లేదు. మరికొంతమంది రాత్రి వేళల్లో సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల దానికి బానిసలై తెల్లవారుజాము వరకు నిద్రపోకుండా ఉంటున్నారు. అయితే అదే అలవాటుతో సెల్ వాడని సమయంలో కూడా నిద్ర రాకుండా సతమతమవుతుంటారు. అయితే అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..\
ఎవరికైనా అర్ధరాత్రి అయినా నిద్ర రాదో వారు ముందుగా కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత భగవంతున్ని ఒక్కసారి ధ్యానించుకొని ఓ మంత్రాన్ని చదవాలి.. ఆ మంత్రం ఏంటయ్యా అంటే.. “అగస్తి మార్గ వచ్చేవా ముచుకుండే మహాబల: కపిలో ముని రాస్తిక: పంచైతే సుఖశాయన:” ఈ మంత్రాన్ని కాస్త కళ్ళు మూసుకొని జపిస్తే చాలు నిద్ర ఇట్టే పట్టేస్తుందట. ఇలా ఒక వారం రోజులు చేయాలి. ఆ తర్వాత మీరే ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడతారు. మార్పును గమనిస్తారు అని జ్యోతిష నిపుణులు అంటున్నారు.
also read:అంత్యక్రియల అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?