Home » చల్లటి నీరు తాగితే బరువు పెరుగుతారా ? డాక్టర్లు ఏం చెప్పారంటే..?

చల్లటి నీరు తాగితే బరువు పెరుగుతారా ? డాక్టర్లు ఏం చెప్పారంటే..?

by Anji
Ad

ఆరోగ్యం విషయంలో ఎన్నో నమ్మకాలు, మరెన్నో అపనమ్మకాలు ఉంటాయి. వైద్యులు చెప్పే సూచనలు కాకుండా, కొందరు తమ తమ విశ్వాసాల ఆధారంగా కొన్నింటిని నమ్ముతుంటారు. అలాంటి వాటిలో చల్లటి నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారు. అయితే కూల్ వాటర్ తాగితే నిజంగానే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారు? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


శరీరానికి మీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిస్ ప్రకారం, 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు ప్రతిరోజు కనీసం 3.7 లీటర్లు నీరు తాగాలి. 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు ప్రతిరోజు కనీసం 2.7 లీటర్లు నీరు తాగాలి. గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలకు దీని కంటే ఎక్కువ నీరు అవసరం. సరిపడ నీరు తీసుకోవడం వల్ల రోజంతా తాజాగా, శక్తిగా ఉండొచ్చు.కాగా చల్లటి నీరు తాగితే బరువు పెరుగుతారనే నమ్మకం ఉంది. కానీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రకారం, చల్లని నీటికి బరువు పెరుగుటతో సంబంధం లేదని తేలింది.

Advertisement

Advertisement


వాస్తవానికి నీటిలో కేలరీలు ఉండవు కాబట్టి అది బరువును పెంచదు. కానీ చల్లని నీరు తీసుకుంటే మాత్రం ఇతర సమస్యలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా చల్లటి నీరు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. గొంతులో నొప్పి లేదా వాపు పెరుగుతుంది. తలనొప్పి సమస్య వేధిస్తుంది. పంటి నొప్పి లేదా సున్నితత్వం పెరుగుతుంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువగా కూల్ వాటర్ తాగడం వల్ల పైన తెలిపిన సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading