Home » సినిమాల్లో హీరో అవ్వాలని వచ్చి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు

సినిమాల్లో హీరో అవ్వాలని వచ్చి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వారిలో ఎవరైనా పెద్ద హీరో అయిపోవాలని వస్తారు. కానీ అలా జరగదు. చాలా మంది డైరెక్టర్ కావాలని కొందరూ హీరోలు, హీరోలు కావాలనుకున్నోళ్లు డైరెక్టర్లు, హీరో కావాలనుకున్న సంగీత దర్శకులు, హీరో కావాలనుకున్న వారు కమెడీయన్ గా  ఇలా చాలా రకరకాలుగా మారిపోతుంటారు.  ఇలాగే లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కే.వి. మహదేవన్ కి కూడా జరిగింది. ఆయన నటుడు కావాలని చిన్నతనం నుంచి ప్రయత్నించాడు. కానీ సంగీత దర్శకుడు అయ్యాడు.

spb

Advertisement

 

ముఖ్యంగా ఆయన కుటుంబం అంతా సంగీతం ప్రావీణ్యం ఉన్నవారే కావడంతో సంగీత దర్శకుడు అవుతాడనుకున్నారు. కానీ మహదేవన్ కి మాత్రం అటు సంగీతంలోనూ ఇటు చదువులో అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఎక్కువగా నాటకాలు వేయడానికి ఇంట్రెస్ట్ చూపేవారు. ఏదో ఒకరోజు పెద్ద హీరో అవ్వాలనుకొని మద్రాస్ రైలు ఎక్కారు. అక్కడికి వెళ్లిన తరువాత చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమాల్లో అవకాశం రాకపోగా బ్రతకడానికి హోటల్ లో సర్వర్ గా పని చేశాడు. జూనియర్ ఆర్టీస్ట్ గా కూడా వెళ్లేవాడు. అలా పరిచయాలు పెంచుకొని అక్కడే ఉండగా.. ఓ హాస్య నటుడు మహదేవన్ ని తీసుకెళ్లి తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఎస్.వీ. వెంకట్రామన్ కి అప్పగించారు. మంచి సంగీత పరిజ్ఞానం ఉందని.. కానీ సినిమా వేషాల కోసం జీవితాన్ని పణంగా పెడుతున్నాడని చెప్పగానే వెంకట్రామన్ కూడా తీసుకున్నారు. 

Advertisement

అక్కడ మొదైన అతని ప్రయాణం అసిస్టెంట్ నుంచి తానే సంగీతం సమకూర్చే వరకు వెళ్లి ఏకంగా 680 కి పైగా సినిమాలకు సంగీతం అందించారు కే.వి. మహదేవన్. ఈ సినిమాల ద్వారా ఎన్ని అవార్డులు దక్కాయో ఆయనకే తెలియదు. చివరగా శ్రీనాథ కవి సార్వభౌముడు అనే చిత్రానికి సంగీతం సగం వరకు పూర్తి చేశాక పక్షవాతం వచ్చి ఎవ్వరినీ గుర్తు పట్టకుండా ఉన్నాడు. దాదాపు పక్షవాతంతో పదేళ్లు మంచానికే పరిమితం అయ్యారు. ఆ చిత్రాన్ని ఆయన శిష్యుడు పూర్తి చేశాడు. 2001లో మహదేవన్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

Also Read :  రజినీకాంత్ కి ఎన్టీఆర్ చేసిన సహాయం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading