మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య జరిగినటువంటి ట్విట్టర్ గొడవలు ఆసక్తికరమైన పరిణామాలకు దారి తీసింది. దీంతో అల్లు అర్జున్ నందమూరి అల్లు అర్జున్ గా మారిపోయాడు. మరి ఇలా జరగడానికి కారణం ఏంటి.. అసలు ఏం జరిగింది.. ఓ సారి చూద్దాం..? మెగా ఫ్యాన్స్ మరియు బన్నీ ఫ్యాన్స్ మధ్య జరిగినటువంటి ట్విట్టర్ గొడవ చాలా విచిత్రమైన పరిణామాలకు దారి తీసింది. దారి తీయడమే కాదు అల్లు అర్జున్ ను నందమూరి అల్లు అర్జున్ గా మార్చేసింది. ట్విట్టర్ వేదికగా జరిగిన అగ్లీ క్లాష్ తర్వాత, మెగా ఫ్యాన్స్ బన్నీని తిరస్కరించారని, బన్నీ మెగా ఫ్యామిలీని స్టార్ హీరోగా ఎదగడానికి ఉపయోగించుకున్నారని, స్టార్ డమ్ సంపాదించుకున్న తర్వాత వారిని పక్కన పెట్టారని సూచించారు. ఈ గొడవలో అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నందమూరి అభిమానుల నుంచి మద్దతును పొందుతున్నారు. మెగా ఫ్యాన్స్ అసహనానికి నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ కి మద్దతుగా నిలుస్తూనే ఉంటారు.అయితే మెగా కాంపౌండ్ కి మరియు బన్నీకి మధ్య గ్యాప్ కనిపిస్తుండడంతో నందమూరి అభిమానులు బన్నీని సొంతం చేసుకోవడానికి ఇది ఒక కారణం. అలాగే అఖండ ఈవెంట్ లో కూడా బాలకృష్ణ తో బన్నీకి ఉన్న అనుబంధం చూసిన నందమూరి అభిమానులు చాలా సంబరపడిపోయారు. ఈ విధంగా నందమూరి ఫ్యాన్స్ లో ఒక వర్గం అల్లు అర్జున్ కి నందమూరి అల్లు అర్జున్ అని పేరు పెట్టేసింది. ఇదే ఆ పరిస్థితిని అర్థం చేసుకునే సారాంశం. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ నందమూరి ఫ్యామిలీ కి డార్లింగ్ గా ఎదిగారు.
Advertisement
ALSO READ;
Advertisement
అయోమయంలో పడ్డ “ఆది పురుష్” చిత్ర యూనిట్.. కారణం ఇదేనా..?
థాంక్యూ ట్రైలర్ లో ఆ డైలాగ్ ను గమనించారా..? సమంతను ఉద్దేశించే చైతూ అంత మాట అన్నాడా..?