Home » మెగా ఫ్యామిలీపై విమర్శలు… రోజాను ఓ ఆట ఆడుకున్న బ్రహ్మాజీ !

మెగా ఫ్యామిలీపై విమర్శలు… రోజాను ఓ ఆట ఆడుకున్న బ్రహ్మాజీ !

by Bunty
Ad

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచి అన్ని పార్టీలు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీ వర్సెస్ వైసీపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత బుధవారం ఏపీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారని తెలిపారు.

Advertisement

 

వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రావని, ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమోనన్న భయంతో చిన్న ఆర్టిస్టులు కూడా వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. అంతే తప్ప వాళ్లపై ప్రేమతో మాట్లాడడం లేదన్నారు రోజా. మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసినప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా ఎందుకు గెలవలేదో ఆలోచించాలన్నారు.

Advertisement

అలాంటి వారి కోసం చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని అనుకోవడం లేదని చెప్పుకోచ్చారు రోజా. అయితే రోజా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. “నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా, అంతా భయపడతారు ఎందుకు” అని ట్విట్టర్ లో మంత్రి రోజాను ప్రశ్నించారు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీ నుంచి మొదటిసారి రియాక్ట్ అయిన పర్సన్ నువ్వే అన్న, థాంక్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. మరి బ్రహ్మాజీ ట్వీట్ కి ఏపి మంత్రి రోజా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

READ ALSO : Mission Majnu Review : స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ రివ్యూ

Visitors Are Also Reading