Ad
అందమంటే ఎవరికైనా ఇష్టమే.అందంగా కనిపించడం కోసం చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు రకరకాల క్రీములు రాసుకుంటూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా అమ్మాయిలు మేకప్ కిట్లు వాడితే అబ్బాయిలు కేవలం నార్మల్ క్రీమ్ లతో సరి పెట్టుకుంటారు. అలాంటి అబ్బాయిలు మరింత అందంగా కనబడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. వివరాల్లోకి వెళితే చాలామంది బాడీ మీద యూస్ చేసే సబ్బునే ముఖానికి కూడా పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోకూడదని నిపుణులు అంటున్నారు.
దీనికి ప్రధాన కారణం బాడీ కంటే ముఖం మీద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుందట. ఈ చర్మానికి తగ్గట్టుగా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే బాగుంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఎటైనా బయటికి వెళ్లిన సమయంలో సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవడం చాలా మంచిదంటున్నారు. అంతేకాకుండా ఎటైనా దూర ప్రయాణాలు చేసే సమయంలో మొహం మీద దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది. దీనివల్ల ఫేస్ చెడిపోకుండా ఉండాలి అంటే మాశ్చరైజేషన్ మొహం మీద పెట్టుకోవడం ఉత్తమం. అయితే చాలామంది మగవాళ్ళు షేవింగ్ చేసే సమయంలో రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు.
అలాకాకుండా మన శరీరానికి ఏది సెట్ అవుతుందో దాన్ని వాడుకోవడం వల్ల ముఖం అందంగా తయారవుతుందని అంటున్నారు. అంతేకాకుండా గ్లిజరిన్,కలబంద వంటివి చర్మానికి మంచి చేస్తాయని ఈ సహజ సిద్ధమైన వాటిని వాడితే చర్మం సున్నితంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నారింజ రసం లో కాస్త పసుపు వేసి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత మొహాన్ని కడుక్కుంటే కాంతివంతమైన మొహం మీ సొంతం అవుతుందని వైద్యులు అంటున్నారు.
Advertisement