World Cup 2023 : వన్డే వరల్డ్ 2023 టోర్నమెంట్ 2023 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు రెండేసి విజయాలు సాధించి.. మంచి ఊపులో ఉన్నాయి. అయితే.. శనివారం జరిగే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ట్విట్టర్ X లో #BOYCOTTINDOPAKMATCH అంటూ ట్రెండ్ నడుస్తోంది. ఎందుకంటే గుజరాత్లో పాకిస్తాన్ పేయర్లకు ఘనస్వాగతం పలికారు.
పూలుచల్లి, బెలూన్స్ తో వెల్కమ్ చెప్పారు. గుజరాతి స్టైల్లో అమ్మాయిలు డాన్సులు కూడా చేశారు. దీనిపైన ఇప్పుడు భారతీయులు ఫైర్ అవుతున్నారు. పోయిన నెల సెప్టెంబర్ 13న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు ఆర్మీ మరియు ఒక పోలీస్ ఆఫీసర్ మరణించారు. ఇదే కాక పాకిస్తాన్ నుంచి చాలామంది ఉగ్రవాదులు బార్డర్లో సైనికులను చంపేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్లు ఇండియాకు చావులను గిఫ్ట్ గా ఇస్తుంటే, రిటర్న్ గిఫ్ట్ గా మన అమ్మాయిలు పాక్ ప్లేయర్లకు వెల్కమ్ చెప్పి వాళ్లముందు డ్యాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బీసీసీఐ ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement
అయితే ఈ వాధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్ అన్నది ఒక స్పోర్ట్ మాత్రమే. రాజకీయాలతో ముడిపెట్టకూడదు. ఏదైనా విదేశీ టీమ్ ఇండియాలో అడుగుపెడితే ఘనంగా ఆతిథ్యం ఇవ్వడం మన సాంప్రదాయం. ఇక్కడ అదే చేశారు తప్ప క్రికెట్ కు రాజకీయాలతో ముడిపెట్టకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా, మొన్న ఆఫ్గన్ జట్టుపై గెలిచిన టీమిండియా నిన్ననే అహ్మాదబాద్ కు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
ఇవి కూడా చదవండి
- గ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలివే..ఈ నెలలో రెండు గ్రహణాలు !
- Lavanya Tripathi : నిహారికకు లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్…మెగా పరువు తీయకంటూ !
- చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు..మాకు భయం వేస్తోంది – భువనేశ్వరి