హీరో రామ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తాజాగా వచ్చిన సినిమా స్కంద. గత శుక్రవారం రోజున హీరో రామ్ చేసిన స్కంద సినిమా రిలీజ్ అయింది. మాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉండడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది స్కంద మూవీ. ఈ సినిమాలో ఎక్కువగా రాజకీయాలను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు స్కంద దర్శకుడు బోయపాటి శ్రీనివాస్.
ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతున్న స్కంద సినిమా గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు… అమలు అవుతున్న సంక్షేమ పథకాలను ఉద్దేశించి స్కంద సినిమాలో దర్శకుడు బోయపాటి డైలాగులు రాసాడట. చంద్రబాబు అరెస్టు కాకముందే ఆ డైలాగులతో సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారట.
Advertisement
Advertisement
కానీ దర్శకుడు బోయపాటి ప్లాన్ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయింది. స్కంద సినిమా రిలీజ్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు జైల్ కు వెళ్లారు. దీంతో మొదట రిలీజ్ చేయాలనుకున్న డేట్ ను మార్చుకున్నారు. దీంతో గత వారం ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే మొదట ఉన్న డైలాగులను కొన్ని కట్ చేసి… రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయినప్పటికీ ప్రభుత్వానికి కొన్ని వ్యతిరేకంగానే డైలాగులు ఉన్నాయట. వాస్తవానికి చంద్రబాబు నాయుడు జైల్లో లేకపోతే… ఆ డైలాగులను తెలుగుదేశం పార్టీ బాగా వాడుకునేదని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు జైల్లో పడడంతో… స్కంద సినిమా డైలాగులు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడలేదని కొందరు అంటున్నారు. కాగా స్కంద హీరో రామ్ మరియు బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉంటారన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Temba Bavuma : హే బాబు లే… బవుమాపై ట్రోలింగ్ !
- Pushpa 2 : పుష్ప-2 సినిమాలో ఉర్ఫీ జావేద్ ?
- Bigg boss 7 : ‘బిగ్బాస్ రతికతో హీరో కిరణ్ పెళ్లి’…?