ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చాలా రసవత్తరంగా మారిపోయింది. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో వారికి ఓటు వేసే అవకాశం ఉంటుందా..? లేదా వారిపై స్పీకర్ అనర్హత వేటు వేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Advertisement
Advertisement
కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ వైసీసీ వర్సెస్ టీడీపీ అండ్ జనసేన ఫైట్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. తాజాగా ఇటీవల భీమిలీలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లను ఏర్పాటుచేయడం, వాటికి బాక్సింగ్ పంచింగ్ బ్యాగ్స్ అమర్చడం తీవ్ర చర్చనీయంశంగా మారింది. తాజాగా దీనిపై స్పందించారు చంద్రబాబు. భీమిలి వైసీపీ సభలో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోకు బాక్సింగ్ బ్యాగ్ పెట్టి కొట్టడం, కాలితో తన్నడం వంటివి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వాటిని నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా ? అని ప్రశ్నించారు. ఒకవేళ తాను కూడా అలాంటి పని చేస్తే అనుమతిస్తారా ? అని పోలీసులను నిలదీశారు. సభలు పెట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం తప్పుకాదని.. కానీ ఇలాంటి చర్యలు ఏంటని విమర్శించారు. వైసీపీ రోజురోజుకు దిగజారిపోతోందని చంద్రబాబు ఆరోపించారు.