Home » కవలలకు జన్మనిచ్చిన బిగ్ బాస్ విజేత..!

కవలలకు జన్మనిచ్చిన బిగ్ బాస్ విజేత..!

by Anji
Ad

బుల్లితెర నటి బిగ్ బాస్ విజేత రుబీనా దిలక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత రివీల్ చేసింది. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా జన్మించినట్లు ఆమె వెల్లడించింది. కానీ అంతకుముందే రుబీనా, అభినవ్ జంటకు ట్విన్స్ జన్మించినట్లు రుబీనా ఫిట్నెస్ ట్రైనర్ పోస్ట్ చేశారు. ఈ బుల్లితెర జంట తమ కుమార్తెల పేర్లను కూడా వెల్లడించారు. కవలలకు జీవా, ఈధా అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు.

Advertisement


పిల్లలు జన్మించి నెల రోజులు పూర్తి కావడంతో ఇంట్లో పూజలు నిర్వహించారు. తమ కూతుళ్లను చేతుల్లో పట్టుకుని కెమెరాల ముందు కనిపించారు. కాగా.. రుబీనా బుల్లితెర నటుడు అభినవ్ శుక్లాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఇన్ స్టాలో రాస్తూ.. మా కుమార్తెలు జీవా, ఈధాలకు నెల రోజులు నిండాయని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. గురునానక్ లాంటి పవిత్రమైన రోజున ఆ దేవుడు ఆశీర్వదించాడు.

Advertisement

ఈ సందర్భంగా దేవతలకు మా శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఈ జంట 2018లో సిమ్లాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్- 14 లో పాల్గొన్నారు. ఈ సీజన్ విజేతగా రూబీనా నిలిచింది. అభినవ్ ఇంట్లో పెద్దమనిషిగా ప్రశంసలు అందుకున్నారు.

Visitors Are Also Reading