Home » బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పెళ్లి.. తల్లిదండ్రులు ఆ డిసిషన్ తీసుకున్నారా ?

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పెళ్లి.. తల్లిదండ్రులు ఆ డిసిషన్ తీసుకున్నారా ?

by Anji
Ad

కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి ఏకంగా టైటిల్ సొంతం చేసుకున్నటువంటి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఇలా ఒక కామన్ మ్యాన్ కప్పు గెలవడం జరిగింది. బిగ్ బాస్ కార్యక్రమం పై ఉన్నటువంటి ఇష్టంతోనే ఈయన ఈ కార్యక్రమంలోకి రావడం కోసం ఎన్నో ఇబ్బందులను పడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో అవకాశం అందుకున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పాటిస్పేట్ చేస్తూ తన గ్రాఫ్ పెంచుకున్నారు. ఇలా ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి సెలెబ్రిటీలను కూడా వెనక్కి తోసి ఏకంగా విన్నర్ గా నిలిచారు.

Advertisement

ఇలా బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో పల్లవి ప్రశాంత్ గురించి తన తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పలు విషయాలను తెలియజేశారు. తన పేరు పల్లవి ప్రశాంత్ కావడంతో ఈయనకు పెళ్లి జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. తన గురించి వస్తున్నటువంటి వార్తలపై తన తల్లిదండ్రులు స్పందించారు. తన కొడుకుకు పెళ్లి కాలేదని తెలియజేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే తన కొడుకుకి పెళ్లి చేస్తాము అంటూ పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తెలియజేశారు.

తన తల్లిదండ్రులు చెప్పినట్టుగానే ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఇప్పటికే తనకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారని తెలుస్తుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈయనకు కెరియర్ పరంగా కూడా మంచి అవకాశాలు కూడా వస్తాయని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో పల్లవి ప్రశాంత్ తన తల్లిదండ్రులు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంటారా లేక కెరియర్ పై ఫోకస్ పెట్టి సినిమాలలో కొనసాగుతారా అన్న విషయం తెలియదు కానీ గతంలో తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading