పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా పాన్ ఇండియా రేంజ్ లో, 5 భాషల్లో తెరకెక్కిన పుష్ప మూవీ డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్ లో బన్నీ ఇమేజ్ ను నిలబెట్టింది ఈ మూవీ. పుష్ప నుంచి ఫస్ట్ పార్ట్ మూవీ రిలీజ్ అవ్వగా, సెకండ్ పార్ట్ ను మూవీని ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్.
అయితే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో పాటు అందరిని ఆకర్షించిన మరో పాత్ర కేశవ. ఈ పాత్ర చేసి జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయింది. నిజానికి ఈ పాత్ర కోసం ఓ ఫేమస్ యాక్ట్రెస్ ను అనుకున్నారట. బన్నీతో సమానమైన పాత్ర కేశవది. అయితే, ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్న యాక్టర్ కు ఇస్తారు కానీ పుష్పలో కేశవ పాత్ర మాత్రం జగదీష్ అనే జూనియర్ ను వరించింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న వాళ్లలో బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్, యాక్టర్ మహేష్ విట్టాను కూడా ఉన్నాడట.
Advertisement
Advertisement
మహేష్ విట్టా అయితే రాయలసీమ స్లాంగ్ ను పర్ఫెక్ట్ గా పలకగలడు. తన వీడియోలు అన్నీ కూడా రాయలసీమ యాసలోనే ఉంటాయి. దాంతో మహేష్ వైపు మొగ్గు చూపారట సుకుమార్ తో పాటు మూవీ టీమ్ అంతా. అంతేకాదు ఈ ఆడిషన్ లో మహేష్ కూడా వెళ్ళాడట. అక్కడ మహేష్ కు సీన్ పేపర్స్ కూడా ఇచ్చి, దాదాపు కన్ఫర్మ్ చేసినంత పనిచేశారట. ఈ విషయాన్ని మహేష్ విట్టా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ చివరకు ఓ కొత్త కుర్రాన్ని తీసుకున్నారని అన్నారు మహేష్ విట్టా.
READ ALSO : Rishabh Pant : యాక్సిడెంట్ తర్వాత పంత్ ఫస్ట్ ఫోటో రిలీజ్… వైరల్