సాధారణంగా పచ్చిమిర్చిని దాదాపు ప్రతీ వంటకంలో రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటారు. కొంతమంది పచ్చిమిర్చి తింటే మాత్రం కడుపులో మంట వస్తుందని అంటుంటారు. కానీ పచ్చిమిర్చితో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు ప్రతి రోజు తినకుండా ఉండరు. అందుకే చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఘాటెత్తించే పచ్చిమిర్చిని చాలా వంటకాల్లో తప్పనిసరిగా వాడుతుంటారు. ముఖ్యంగా పెరుగులో పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేస్తుంటారు. పచ్చిమిర్చి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తుందట.
అయితే ఈ పచ్చిమిర్చి కాస్త కారంగా ఉన్నప్పటికీ ఇందులో విటమిన్ సీ కూడా ఉంటుంది. రోజు ఒక పచ్చి మిరపకాయను తింటే శరీరానికి కావాల్సిన విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడేవారు. పచ్చిమిర్చి తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాదు.. పచ్చిమిర్చి రుచిని పెంచడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. గాయాలు అయినప్పుడు ఎక్కువ రక్త స్రావం కాకుండా నిలుపుతుంది. గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. పచ్చి మిర్చిలో ఉండే విటమిన్ బీ6, విటమిన్ ఏ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి పోషణను అందిస్తాయి. పచ్చిమిర్చి చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుందని పేర్కొంటున్నారు నిపుణులు.
Advertisement
Advertisement
పచ్చిమిర్చిలో యాంటి ఆక్సిడెంట్లు ఉండడం వల్ల వైరస్, బ్యాక్టీరియా నుంచి వ్యాపించే వ్యాధులను అడ్డుకుంటుంది. అంతేకాదు.. పచ్చి మిరపకాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ తో ఒత్తిడి ఇతర పరిస్థితులను ఎదుర్కోవచ్చు అనిచెబుతున్నారు. అదేవిధంగా గుండె జబ్బులతో పాటు, క్యాన్సర్ కారకాలను కూడా నిరోధిస్తుందంటున్నారు. ఇక జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని వారికి పచ్చిమిర్చి మంచి ఔషదం మాదిరిగా పని చేస్తుంది. పచ్చిమిర్చి వేడిని ఉత్పత్తి చేసి జీర్ణ వ్యవస్థ యాక్టివ్ గా ఉండేవిధంగా చేస్తుంది. మిరపకాయలోఉండే ఈ గుణం కారణంగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతోందని పేర్కొంటున్నారు నిపుణులు.
Also Read :
కెప్టెన్ అయిన పుజారా.. ఎలా అంటే…?
డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్..!