Home » సౌందర్యకు తీరని కోరిక ఉండేదట.. అది ఏంటో తెలిస్తే మీరు కన్నీరు పెడతారు..?

సౌందర్యకు తీరని కోరిక ఉండేదట.. అది ఏంటో తెలిస్తే మీరు కన్నీరు పెడతారు..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు పోయారు. కానీ అందులో ఇంతటి స్టార్డంను సంపాదించుకున్న వారు మాత్రం సౌందర్య ఒకరే అని చెప్పవచ్చు.

Advertisement

ఆమె తనదైన నటనతో ఎంతోమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంది. ఎలా అంటే చాలామంది హీరోయిన్ సౌందర్య ఉంటే సినిమా థియేటర్ కు వెళ్లి మరీ చూసేవారు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు. అంటే ఆమె ఎంతటి అభిమానాన్ని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. అలా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది నటి సౌందర్య అని చెప్పవచ్చు. ఈమె గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ కు పెట్టింది పేరు. హీరోయిన్లకు అయితే ఆ గ్లామర్ ఎంత ఉంటే పరిశ్రమలో అంత రాణించవచ్చు. దీంతోపాటుగా నటనా సామర్థ్యం ఉంటే వారికి ఇక తిరుగుండదు. ఇవన్నీ కలిపి సౌందర్యలో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ కథానాయిక చిన్న చిన్న పాత్రలతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ తన నటనతో ఎంతోమంది దర్శకులను ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.కానీ సౌందర్యకు ఒక కోరిక మాత్రం తీరలేదట..
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా, పవిత్ర బంధం ఇలా కుటుంబ సంబంధ చిత్రాల్లోనే కాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె ఏ పాత్ర పోషించినా చాలా సహజంగా సింపుల్ గా అందరినీ ఆకట్టుకునేలా ఉండేది. అందుకే ఆమెకు సహజనటి అనే బిరుదు కూడా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన విషయం అందరికీ తెలిసినదే. కానీ ఇంత స్టార్ అయిన సౌందర్యకు ఒక కోరిక మాత్రం తీరా లేదట. ఆమె ఒక్క సినిమాకైనా దర్శకత్వం చేయాలని కోరిక ఉండేదట. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె అకాల మరణం చెందింది.

Advertisement

ALSO READ;

ఆనంద్ సినిమా హీరో రాజా గుర్తున్నాడా…? ఇప్పుడు ఎలా ఉన్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?

Visitors Are Also Reading