ప్రపంచ వ్యాప్తంగా అతధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటల్లో మొదటి స్థానంలో ఫుట్ బాల్ ఉంటె రెండో స్థానంలో క్రికెట్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. కానీ ఇంకొన్ని రోజులు అయితే అది రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్లేస్ లోకి క్రికెట్ వచ్చి సెకండ్ ప్లేస్ లోకి ఫుట్ బాల్ వెళ్లేలా కనిపిస్తుంది. అయితే ఫుట్ బాల్ లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ అనేది ఎంత పోపులరో క్రికెట్ లో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా అంతే పాపులర్. కానీ ఇప్పుడు ఈపీఎల్ కంటే మన ఐపీఎల్ బెస్ట్ అంటున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.
Advertisement
అయితే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన గంగూలీ మాట్లాడుతూ.. క్రికెట్ అనేది ఇప్పుడు ఎంతలా అభివృద్ధి చెందింది అనేది అందరికి కనిపిస్తుంది. నేను క్రికెట్ ఆడినప్పుడు వందలు, వేలు సంపాదిస్తే ఇప్పుడు మాత్రం ఆటగాళ్లు కోట్లలోనే అందుకుంటున్నాడు. అయితే ఈ ఐపీఎల్ అనేది మన భారత అభిమానుల నుండి పుట్టుంది అనే చెప్పాలి. అందుకే ఇప ప్రారంభమైన 2008 నుండి ఇప్పటివరకు దీనిని వారే నడిపిస్తున్నారు. ఫుట్‌బాల్‌కు చెందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే.
Advertisement
కానీ ఇప్పుడు ఆ లీగ్ కంటే మన ఐపీఎల్‌కే ఎక్కువగా ఆదాయం వస్తుంది అనేది నిజం. నేను ఎంతో ఇష్టపడే క్రికెట్ ఇంతగా పాపులర్ అవుతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ఐపీఎల్ మీడియా రైట్స్ యొక్క వేలం అనేది జరుగుతుంది అనేది అందరికి తెలిసిందే. ఈ ఏడాదితో గతంలో కుదుర్చుకున్న స్టార్ స్పోర్ట్స్ రైట్స్ అనేవి ముగిసిపోయాయి. అందుకే ఇప్పుడు 2023 నుండి 2027 వరకు గల 5 ఐపీఎల్ సీజన్ల రైట్స్ కు వేలం నిర్వహితుంది బీసీసీఐ.
ఇవి కూడా చదవండి :