బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పండుగలు, వారాంత సెలవులతో కలిపి మే నెలలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 12 రోజులపాటు బ్యాంకు సెలవులు నిలిచిపోనున్నాయి. ప్రతిరోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్లేవారు చాలామంది ఉంటారు. ఏదో ఒక అవసరం కోసం వారంలో ఒక్క రోజైనా బ్యాంకుకు వెళ్లాల్సి రావచ్చు. అయితే బ్యాంకులకు నెలలో ఏయే రోజుల్లో పనిచేస్తాయి లేదా మూసి ఉంటాయన్న విషయం ముందస్తుగా తెలుసుకోవడం చాలా కీలకం.
Read Also : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?
Advertisement
ఇవి తెలుసుకోకపోతే సమయం వృధా అవుతుంది. అందుకే బ్యాంకు వినియోగదారులు బ్యాంకులో సెలవుల గురించి ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మే నెల రాబోతోంది. అయితే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి. రిజర్వు బ్యాంకు విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం… ఆ జాబితా ఓసారి చూద్దాం.
Advertisement
Read Also : మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : CM KCR
మే 1 – మేడే
మే 5 – బుద్ధ పూర్ణిమ
మే 7 – ఆదివారం
మే 9 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
మే 13 – రెండో శనివారం
మే 14 – ఆదివారం
మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కింలో మాత్రమే)
మే 21 – ఆదివారం
మే 22 – మహారాణా ప్రతాప్ జయంతి
మే 24 – కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (త్రిపురాలో)
మే 27 – నాలుగో శనివారం
మే 28 – ఆదివారం
అయితే, ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. తెలంగాణ, ఏపీలో ఈ బ్యాంకు సెలవులు ఒకేలా ఉంటాయి.
READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!