Home » ఆకాష్ పూరి పై ఆసక్తికర కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.. ఏమన్నారంటే..?

ఆకాష్ పూరి పై ఆసక్తికర కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.. ఏమన్నారంటే..?

by Sravanthi
Ad

ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ గురించి సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే విషయం వార్తల్లో నిలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్దమో ఉందో తెలియదు.కానీ ఈ క్రమంలోనే పూరి కొడుకు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ సినిమానీ నిర్మించడం వల్ల బండ్ల గణేష్ కు ఆకాష్ తో మంచి స్నేహం ఏర్పడింది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ వచ్చి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే నేను ఈ ఫంక్షన్ కి రావడానికి ప్రధాన కారణం మా వదిన లావణ్య పూరి. అమ్మ,అక్క, వదిన ఎలా ఉండాలి అంటే లావణ్య పూరి లా ఉండాలి అని అన్నారు. నా తల్లి తర్వాత ఆమెను గౌరవిస్తాను. అంతటి వ్యక్తిత్వం ఆమెకు ఉంది.అంతటి మహా తల్లిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆకాష్ మరియు పూరికి అన్నది. పూరి స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత చాలామంది వచ్చారు. కానీ ముందుగా వచ్చింది మాత్రం ఈ మహా తల్లే. అప్పట్లో ఒక సామెత ఉండేది.దేశమంతా కళ్లాపి చల్లాడు గాని.. తన ఇంటిముందు చల్లడానికి సమయం లేదు ఆయనకి..పూరి డైరెక్షన్ లో ఎంతో మంది స్టార్ హీరోలు మంచి పేరు తెచ్చుకొని ఉండి స్టార్ హోదాలో కొనసాగుతున్నారు. డైలాగులు, డ్యాన్సులు రానివారికి డైలాగులు,డ్యాన్స్ నేర్పించాడు. ఒకవేళ నా కొడుకు అయితే నేను లండన్ లో ఉన్నా వచ్చేవాడిని అంటూ బండ్లగణేష్ అన్నారు.ఆయన ఎక్కడున్నారో?ఎంత బిజీగా ఉన్నారో?తెలియదు కానీ, అన్న ఇలాంటి పని ఇంకొక్కసారి చేయకు అని అన్నాడు. ఎంతో మంది స్టార్స్ ను చేసి నీ కొడుకు విషయానికి వచ్చేసరికి నువ్వు లేవని ఇదెక్కడి న్యాయం అంటూ అడిగారు. చోర్ బజార్ మూవీ లో ఆకాష్ అదరగొట్టారు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. ఏదో ఒక రోజు నీ కొడుకు డేట్స్ కోసం నువ్వు కూడా క్యూ లో నిలబడే రోజు వస్తుందని, నేనన్న మాటలు గుర్తు పెట్టుకో అని అన్నారు. అలాంటి రోజు రాకపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు, ఆ రోజు వచ్చినప్పుడు నీకు డేట్స్ ఇవ్వకుండా నేనే చేస్తాను అని బండ్ల గణేష్ వెల్లడించారు.

Advertisement

ALSO READ;

Advertisement

వామ్మో ఫస్ట్ లుక్ చూసి కేక అనుకున్నాం..కానీ ఆ రెండు సినిమాల కాపీ నా ఇది ?

నటి పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరంటే ? ఆయనతో ఉన్న వివాదం అదేనా ?

 

Visitors Are Also Reading