నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తే చాలు. మాస్ సినిమాలే గుర్తుకు వస్తాయి. తొడకొట్టడాలు మీసం తిప్పడాలు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా లాంటి డైలాగులే వినిపిస్తాయి. కానీ నవరసాలను పలికించగల నటుడు బాలకృష్ణ. కేవలం మాస్ సినిమాలలోనే కాకుండా పౌరాణిక పాత్రల్లోనూ బాలయ్య పరకాయప్రవేశం చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక బాలయ్యలో కేవలం నటన మాత్రమే కాకుండా మరిన్ని టాలెంట్స్ కూడా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.
Advertisement
పాటలు పాడటం స్టంట్ లు చేయడం ఇలా బాలయ్య అన్ని విషయాలలోనూ తోపే. అంతే కాకుండా రెండు పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం కూడా బాలయ్యకు వచ్చింది. కానీ ఆ అవకాశం మధ్యలోనే చేజారిపోయింది కూడా ఆ సినిమాలు ఏంటో దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…బాలయ్య తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా సామ్రాట్ అశోక. ఈ సినిమాకు ఎన్టీఆర్ దర్శకత్వం వహిస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు బాలయ్య దర్శకుడు అని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. గౌతమ బుద్దుడు సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలని బాలయ్యకు కోరిక ఉండేది. ముందుగా బుద్దం అశోక అనే టైటిల్ ను అనుకున్నారు.
Advertisement
అంతే కాకుండా గౌతమబుద్దుడి గా ఎన్టీఆర్ నటిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఆ తరవాత ఈ సినిమా పేరు సామ్రాట్ అశోక గా మారింది. ఈ సినిమా షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. చాణక్యుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ పై బాలయ్య మొదట క్లాప్ ఇచ్చారు. కానీ ఆ తరవాత తండ్రి తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ ల వల్ల బాలయ్య ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో ఎన్టీఆర్ సామ్రాట్ ఆశోక సినిమాను నటిస్తూ దర్శకత్వం వహించారు. అలా బాలకృష్ణ దర్శకత్వం వహించాల్సిన సామ్రాట్ అశోక సినిమాకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు.
బాలయ్య రెండోసారి దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించిన సినిమా నర్తనశాల. ఈ సినిమాలో అర్జున పాత్రను బాలయ్య చేపట్టారు. ద్రౌపతి పాత్రకు సౌందర్య, దుర్యోదనుడిగా సాయికుమార్ ను మరికొన్ని పాత్రలకు టాలీవుడ్ ప్రముఖులను తీసుకున్నారు. ఈ సినిమా తొలిషెడ్యూల్ కూడా పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేసరికి విజయేంద్ర వర్మ షూటింగ్లో బాలయ్య గాయపడ్డారు. ఆ తరవాత సౌందర్య హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అలా ఈ సినిమా పూర్తవ్వకుండా మధ్యలోనే ఆగిపోయింది.
ALSO READ :
ఆచార్యలో కాజల్ ను మాత్రమే కాదు వాళ్లను కూడా లేపేశారట..!
మహేష్ బాబుకు ఆర్.నారాయణమూర్తికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?