Home » ఆచార్య‌లో కాజ‌ల్ ను మాత్ర‌మే కాదు వాళ్ల‌ను కూడా లేపేశార‌ట‌..!

ఆచార్య‌లో కాజ‌ల్ ను మాత్ర‌మే కాదు వాళ్ల‌ను కూడా లేపేశార‌ట‌..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి కోర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా ఆచార్య‌. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. దాదాపు న‌ల‌భై నిమిషాల పాటు సినిమాలో చ‌ర‌ణ్ చిరులు స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. అయితే సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా పూజాహెగ్డే న‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా మెగాస్టార్ కు జోడీగా ముందు త్రిష‌ను అనుకున్నారు. త్రిష పేరును మేక‌ర్స్ ప్ర‌క‌టించారు కూడా. కానీ ఆ త‌ర‌వాత క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అంటూ త్రిష ప్రాజెక్ట్ నుండి అవుట్ అయ్యింది.

Advertisement

ఆ త‌ర‌వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ లైన్ లోకి వ‌చ్చింది. అయితే దాదాపు సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌య్యే వ‌ర‌కూ కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాలో ఉంద‌నే అంతా భావించారు. కానీ ట్రైల‌ర్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో కాజ‌ల్ కూడా సినిమా నుండి త‌ప్పుకుంద‌ని అనుకున్నారు. చివ‌రికి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాజ‌ల్ ను ప్రాజెక్టు నుండి తొల‌గించామ‌ని బాంబు పేల్చారు. దానికి కార‌ణం న‌క్స‌లైట్ పాత్ర‌కు ల‌వ్ స్టోరీ సెట్ అవ్వ‌క‌పోవ‌డ‌మే అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

నాలుగు రోజులు షూటింగ్ త‌ర‌వాత కాజ‌ల్ ను త‌ప్పించామ‌ని అన్నారు. అయితే తాజాగా కొన్ని వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. కాజ‌ల్ తో పాటూ ఆచార్య‌లో మ‌రికొంద‌రికి కూడా క‌త్తెర వేసిన‌ట్టు తెలుస్తోంది. ముందుగా సినిమా నుండి విడుద‌ల చేసిన లాహే లాహే పాట‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కనిపించిన సంగ‌తి తెలిసిందే.

అంతే కాకుండా కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పాటూ జ‌బ‌ర్ద‌స్త్ స‌త్య, గెట‌ప్ శ్రీను, చ‌మ్మ‌క్ చంద్ర‌లు కూడా పాట‌లో కనిపించారు. అయితే కాజ‌ల్ ను ప్రాజెక్ట నుండి త‌ప్పించ‌డంతో పాటూ కాజ‌ల్ తో కాంబినేష‌న్ సీన్లు చేసిన వీరికి కూడా కొర‌టాల క‌త్తెరవేశారట‌. ఇక ప్ర‌స్తుతం ఆచార్య‌కు నెగిటివ్ టాక్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ :

యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి ఆర్థిక క‌ష్టాల గురించి మీకు తెలుసా..?

ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ఫోటో గ్యాలరీ ..!

Visitors Are Also Reading