తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బలగం మూవీ ఎంతటి ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు. ప్రముఖ కమెడియన్ వేణు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. కమెడియన్ గా మనకు పరిచయమైన వేణు దర్శకుడిగా మంచి కథను అందించి గుర్తింపు సాధించాడని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రంలో ఒక కుటుంబ కథ నేపథ్యంలో తీశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తల్లిగా చేసినటువంటి నటి రూపా లక్ష్మి. ఈమె యాక్టింగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా సంచలనం సృష్టించింది.
Advertisement
ఈ చిత్రాన్ని ప్రతి ఊర్లో పెద్దపెద్ద స్క్రీన్లు పెట్టుకొని మరీ చూశారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ ప్రత్యేకమైన అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఇందులో రూపాలక్ష్మీ నటనకు మామూలు గుర్తింపు రాలేదు. అలాంటి రూపా లక్ష్మి ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఈ సందర్భంగా యాంకర్ మీరు చిన్న వయసులోనే తల్లి పాత్ర చేశారు రేపు ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు తల్లిగా చేయమంటే చేస్తారా అని అడిగారు.
Advertisement
దీంతో రూపాలక్ష్మీ మాట్లాడుతూ. నేను ప్రభాసే కాదు 70 ఏళ్ల హీరోతో కూడా తల్లి పాత్ర చేయమంటే చేస్తా, నాకు ఎలాంటి సమస్య లేదు స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ రూపా లక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం ఆమె ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూప లక్ష్మి కేవలం బలగం, సినిమానే మహర్షి, సరిలేరు నీకెవ్వరు, జాంబిరెడ్డి, టెన్త్ క్లాస్ డైరీస్, నర్తనశాల, వంటి చిత్రాల్లో కూడా నటించి ఆకట్టుకుంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!