బలగం మూవీలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. వారిలో నటుడు మురళీధర్ కూడా ఉన్నాడు. ఈయన స్వస్థలం మెదక్ జిల్లా రామాయంపేట. సిద్దిపేటలోనే చదువుకున్నాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో దాదాపు 27 సంవత్సరాల పాటు పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఈయన విశ్రాంతి తీసుకునే సమయంలో నటన రంగంలోకి అడుగుపెట్టాడు. బలగం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
Advertisement
బలగం మూవీతో పాటు ఇటీవలే నందమూరి నటసింహం బాలకృష్ణ-అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీలో కూడా నటించాడు. ఈ సినిమాలో ఈయన సీఎం పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాత్ర ఏదైనా ఆ పాత్రలో లీనమైపోతాడని నిరూపించాడు మురళీధర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రిటైర్ అయిన తరువాత నటుడు అవ్వాలనే కోరికతో సినిమా రంగానికి వచ్చాను. ఈ వయస్సులో నాకు ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయో లేదోనని తొలుత సీరియల్స్ వైపు వెళ్లాను.
Advertisement
సీరియల్ లో అవకాశాలు దక్కించుకుని అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకున్నాను. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను. బలగం, భగవంత్ కేసరి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇంకా ముందు ముందుకు మరిన్ని అవకాశాలు దక్కించుకోవడానికి తన వంతుగా కృషి చేస్తాను. ముఖ్యంగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీలో మంచి పాత్రను ఇచ్చారు. తనకు ఇంత మంచి గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మురళీధర్ గౌడ్ ఆనంద భాష్పాలు రాల్చాడు. ఇంటర్వ్యూలో తన బాధలను చెప్పుకుంటూ కంట తడి పెట్టడం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.