పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం గురించి అందరికి తెలుసు. బాబర్ వచ్చిన తర్వాతే పాకిస్థాన్ బ్యాటింగ్ బలంగా మారింది అనే విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న బాబర్.. తాజాగా జరిగిన ఆసియా కప్ లో రాణించకపోవడంతో రెండో స్థానానికి పడిపోయాడు. అయితే బాబర్ వెలుగులోకి వచ్చిన తర్వాత నుండి అతడిని కోహ్లీతో పోల్చుతూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
Advertisement
కానీ ఇప్పుడు కోహ్లీకి సాధ్యం కానీ ఒక్క ఘనత బాబర్ కు దక్కింది. అదే బాబర్ పాకిస్థాన్ లోని పుస్తకాల్లోకి ఎక్కాడు. అయితే క్రికెట్ లో ప్రతి ఒక్క ఆటగాడు ఏదో ఒక్క షాక్ ను బాగా ఆడుతాడు. అందులో కోహ్లీ, బాబర్ ఇద్దరు కవర్ డ్రైవ్ అద్భుతంగా ఆడుతారు అనే విషయం తెలిసిందే. కానీ ఈ ఇద్దరిలో ఎవరు బాగా ఆడుతారు అనే ప్రశ్నకు ఎక్కువ మంది బాబర్ పేరునే చెబుతారు .
Advertisement
అయితే ఇప్పుడు ఈ కవర్ డ్రైవ్ వల్లే బాబర్ పుస్తకాల్లోకి ఎక్కాడు. పాకిస్థాన్ లోని 9వ తరగతి యొక్క ఫిజిక్స్ సైబర్ లో బాబర్ యొక్క కవర్ డ్రైవ్ గురించి ప్రశ్న అనేది ముద్రించారు. బాబర్ బ్యాట్ తో 150 కీమీ కైనెటిక్ ఎనర్జిరీతో 120 గ్రాముల బంతిని కవర్ డ్రైవ్ చేసాడు. అప్పుడు ఆ బంతి ఎంత వేగంతో బౌండరీకి వెళ్తుంది అంటూ విద్యార్థులకు ప్రశ్న అనేది వేశారు.
ఇవి కూడా చదవండి :