Home » Axar Patel Marriage Photos : ఘనంగా అక్షర్ పటేల్ పెళ్లి, ఫోటోలు వైరల్

Axar Patel Marriage Photos : ఘనంగా అక్షర్ పటేల్ పెళ్లి, ఫోటోలు వైరల్

by Bunty
Ad

ప్రస్తుతం ఎటు చూసినా పెళ్లిళ్ల హడావిడి కనిపిస్తోంది. యువతి యువకులు బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియ శెట్టిని పెళ్లాడగా, పాక్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్, ఆ జట్టు హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ కూతురిని మనవాడాడు. ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు.

Advertisement

స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను అదరగొడుతున్న స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన ప్రేయసి మేహా పటేల్ తో కలిసి ఏడడుగులు నడిచాడు. గుజరాత్ లోని వడోదర వేదికగా వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అలాగే జయదేవ్ ఉనద్కట్ తదితర టీమిండియా క్రికెటర్లు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

అంతకముందు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలైనా సంగీత్, మెహందీ ఈవెంట్లు కూడా గ్రాండ్ గా జరిగాయి. సంగీత్ సందర్భంగా అక్షర్-మేహ దంపతులు కలిసి సరదాగా డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్షర్ పటేల్ చాలాకాలంగా మేహతో ప్రేమలో ఉన్నాడు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా మేహాకు రొమాంటిక్ గా ప్రపోజ్ చేశాడు. అనంతరం తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనితో వీరి బంధానికి ఇప్పుడు ముడిపడింది.

READ ALSO : టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం

Visitors Are Also Reading