ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే… ఆ క్రేజీ వేరప్ప. ఈ రెండు గంటల మధ్య మ్యాచ్ జరిగితే ఆ సందడి వేరు ఉంటుంది. బెట్టింగులు, చాలెంజ్ లు ఇలా ఎన్నో తెరపైకి వస్తాయి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటే…! ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఫ్రాంచైజీలకు కూడా బాగా లాభాలు వస్తాయి. వ్యూ యర్ షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. దీనికి కారణం ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మొదటి నుంచి ఉన్న వివాదాలు. అయితే… కొన్ని అనివార్య కారణాలవల్ల… పాకిస్తాన్లో టీమిండియా, ఇండియాలో పాకిస్తాన్ అసలు పర్యటించడం లేదు.
Advertisement
ఐసీసీ టోర్నమెంట్ జరిగితే… దుబాయ్, ఆస్ట్రేలియా అలా వేరే మైదానాలలో ఈ జట్లు కలిసి ఆడుతున్నాయి. అయితే ఆసియా కప్ 2023 మాత్రం పెద్ద గొడవను తీసుకువచ్చింది. ఆసియా కప్ 2023… లెక్క ప్రకారం పాకిస్తాన్లో జరగాలి. కానీ అక్కడికి ఇండియా వెళ్ళదు. కచ్చితంగా ఇండియా ఇక్కడికి రావాల్సిందేనని పాక్ దీక్షించుకొని కూర్చుంది. ఇక ఇండియా మాత్రం పాక్ వెళ్లలేదని బీసీసీఐ… ఇప్పటికే స్పష్టం చేసింది. తమ దేశానికి రాకపోతే… వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఆడెందుకు తాము రాబోమని పాకిస్తాన్ హెచ్చరించింది.
Advertisement
దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ జరగడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా ఈ టోర్నీ పై ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుందనీ సమాచారం అందుతుంది. తాజా నివేదిక ప్రకారం… ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశాలలో జరిపేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఈనెల 13వ తేదీన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ లెక్కన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగాలంటే… శ్రీలంక వేదిక అవుతుందన్నమాట. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన కూడా… శ్రీలంక వేదిక అవుతుంది.
మరిన్ని ముఖ్య వార్తలు !
ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో
అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?
Shaitan Movie : సైతాన్ ట్రైలర్‌లో బోల్డ్ పాత్రలో కనిపించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?