కొంతమంది పిల్లలు సరిగా తినకుండా మారం చేస్తూ ఉంటారు. దీనివల్ల వారికి సరైన పోషణ అందక తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి పిల్లలు సరిగ్గా తినాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో నిపుణులు సలహాలిస్తున్నారు.. అవి ఎలాగో చూద్దామా..
నిద్ర లేకపోవడం:
Advertisement
చాలామంది పిల్లలు సరిగా తినడం లేదంటే దానికి ప్రధాన కారణం వారు సరైన సమయంలో నిద్రపోకపోవడం. కంటి నిండా నిద్రపోని పిల్లలు చిరు తిళ్ళకు అలవాటు పడి, అన్నం తినడం మానేస్తారు. కాబట్టి పిల్లలకు మంచి నిద్ర అందెలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది.
also read:Mokshagna : బాలయ్య పుత్రుడి ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ….టైటిల్ కూడా ఇదేనట…!
ఇష్టమైన ఫుడ్:
చాలామంది పిల్లలు పెద్దవాళ్ల లాగే ఇష్టమైన ఆహారం తినాలని అనుకుంటారు. ఏం తినాలన్నది వారిని నిర్ణయం తీసుకొనివ్వండి. ఒక్కసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం కొంచెం డోస్ పెంచుతూ తినబెట్టాలి.ముఖ్యంగా పన్నీరు, చపాతి, పండ్లు, కూరగాయలు ముక్కలుగా చేసి వారంతట వారే తినేలా చూడాలి.
Advertisement
ఆటలాడుతూ :
also read:ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో దుమ్ములేపింది !
ముఖ్యంగా పిల్లలు తినే సమయంలో ఫోన్లు, టీవీ వంటివి చూపించకూడదు. దీనివల్ల వారు ఆహారం రుచిని ఆస్వాదించలేదు. ఎంత తింటున్నామనే ధ్యాస ఉండదు. వీటికి బదులుగా ఆట వస్తువులు సంగీతం వినిపించే వస్తువులు ఉంచితే మంచిది.
తొందరపాటు:
ప్రతిరోజు ఏ టైంలో తినాలి అనే ఒక నియమం ఏర్పరచాలి. రోజులో కనీసం ఒక్క సరైన వాళ్లతో కలిసి తల్లిదండ్రులు తినాలి. మనం తినే పదార్థాలను వారికి చూపించాలి. స్పీడ్ గా తినాలని నియమం పెట్టకూడదు.
also read:కోహ్లీ-గంభీర్ గొడవపై తిక్క కుదిర్చిన BCCI