మీరు గనుక ఆర్థిక ప్రక్షాళన చేయాలనుకుంటే ముందు పర్సు తోనే మొదలు పెట్టాలి. ఎవరి పర్సు ని అయితే ఒక క్రమబద్ధ మార్గంలో మెయింటెన్ చేస్తూ ఉంటారో అలాగే వారు డబ్బులు కూడా చాలా క్రమబద్ధం గా మెయింటెన్ చేస్తారనేది చాలా అధ్యయనాల్లో తేలింది. అయితే పర్సును ఎలా వాడాలో ఒకసారి తెలుసుకుందాం..మనం పర్సులో నోట్లు పెట్టుకునేటప్పుడు 2000, 500,200 ఇలా స్థాయినిబట్టి వరుసక్రమంలో పెట్టుకోవాలి. అలాగే మీ దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్స్,డెబిట్ కార్డ్స్ ను కూడా అలాగే పెట్టుకుంటే బాగుంటుంది. చాలామంది పర్సులో ఒక కార్డు మీద లేదా పేపర్ మీదనో ఏటీఎం పిన్ నెంబర్ రాసుకుంటారు. ఒకవేళ పర్సు మిస్సైతే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అవుతుంది. ఇలాంటి అలవాట్లు మానుకోవాలి. మీరు వాడే పర్సు లో ఎన్ని లేయర్స్ ఉంటే అంత మంచిది. అలాగే మీ జేబులో పట్టే కంఫర్ట్ అయిన పర్సును కొనుగోలు చేయాలి.నెలకు ఒకసారి పర్సును ప్రక్షాళన చేయాలి. డబ్బులు అయిపోయిన, అలాగే గడువు అయిపోయిన కార్డులను తీసివెయ్యాలి. పర్సులో మరీ ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుకోవడం మంచిది కాదు అలాగే మొత్తమే డబ్బులు లేకుండా పెట్టుకోవడం మంచిది కాదు. మీ బడ్జెట్ ని,మీ అవసరాలను బట్టి అవసరమైనంత డబ్బును పర్సు లో ఉంచుకోవాలి. అలాగే పర్సులో ఎప్పుడు కూడా మీ ఆత్మీయుల ఫోటోలు పెట్టు కుంటూ ఉండాలి. దీనివల్ల పర్సులో నుంచి డబ్బులు తీసినప్పుడు మీ భార్య పిల్లలు గుర్తుకు వస్తారు. అలా వాళ్లకు చేయాల్సిన అవసరాలు కూడా గుర్తుకు వస్తాయి. అలా వారు గుర్తుకు వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టడానికి మనసొప్పదు. అలాగే చాక్లెట్ కవర్స్, ఇయర్ బడ్స్, వక్క పొట్లాలు మీ పర్సు లో లేకుండా చూసుకోవాలి.
Advertisement
ALSO READ;
Advertisement
ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?
సాయంత్రం సమయంలో గోర్లు కత్తిరించకూడదు అంటారు ఎందుకో తెలుసా..?