Home » పచ్చి ఉల్లి పాయలు తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ కలుగుతాయా..?

పచ్చి ఉల్లి పాయలు తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ కలుగుతాయా..?

by Anji
Ad

ప్రస్తుతం రోజు రోజుకు అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకు కారణం లేకపోలేదు. మారుతున్న జీవనశైలి.. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అతిగా ఆలోచించడం, సరైన వ్యాయమం లేకపోవడం తదితర కారణాల వల్ల మనిషికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల మన ఆరోగ్యానిన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. మన ఇంట్లోనే ఉండే కొన్నింటిని పాటించడం వల్ల పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

  • ఉల్లి డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించే గుణం ఉంది. ఉల్లిపాయ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల మధుమేహం ఉన్నవారికి షుగర్‌ లెవల్స్‌ అందులో ఉంటాయి.
  • ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మ కాంతిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.
  • ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మ కాంతిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.
  • ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ రసాయాలు ఉండటం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
  • ఉల్లిపాయలలోని సల్ఫర్ ఉండటం కారణంగా రక్తపోటును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. అంతేకాదు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
  • ఉల్లిపాయలలో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తరిమికొడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. సరైన జీర్ణక్రియకు, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి ఇది చాలా ముఖ్యమైనది.
  • ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే రెండు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఎములు బలోపేతం అవుతాయి.ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గిస్తుంది.
  • పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. మెదడు పనితీరును యాక్టివ్‌ చేస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేలా చేస్తుంది.
Visitors Are Also Reading