Home » ఇదేందయ్యా ఇది… 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మేయర్ పెళ్లి

ఇదేందయ్యా ఇది… 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మేయర్ పెళ్లి

by Bunty

 

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అప్పటివరకు కనివిని ఎరుగని విషయాలు మన కళ్ళముందే ఆవిష్కరించబడుతున్నాయి. దేశంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి పలు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు. కానీ ప్రస్తుతం ఆ మాట మసకబారిపోయింది.

READ ALSO : వాహనాల కింద “నిమ్మకాయలను” పెట్టి ఎందుకు తొక్కిస్తారు…?

65 ఏళ్ల వయసులో పదహారేళ్ల అమ్మాయిని ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన దక్షిణ బ్రెజిల్ లో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, దక్షిణ బ్రెజిల్ లోని అరౌకరియా నగరం మేయర్ హిస్సాం హుస్సేన్ దేహైని 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయిని మనువాడారు. పెళ్లి ఇలా కాగానే అలా కొత్త అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చి పడేశారు. తాజాగా బయటకు వచ్చిన ఈ విషయం దుమారం రేపుతోంది.

READ ALSO : Balagam : తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న…

ఇదేందయ్యా ఇది.. 65 ఏళ్ల వయసులో 16ఏళ్ల అమ్మాయితో మేయర్‌ పెళ్లి - Manalokam

మేయర్ పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపైన విచారణ సంస్థలు దర్యాప్తు మొదలు పెట్టాయి. బ్రెజిల్ చట్టాల ప్రకారం 16 ఏళ్ళు దాటిన అమ్మాయిలు తల్లిదండ్రుల అనుమతితో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. దీంతో అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరుసటిరోజే ఈ వివాహం జరిగింది. అమ్మాయి తల్లికి అంతకుముందే విద్యా శాఖలో ఉద్యోగం ఉంది. కానీ తక్కువ జీతం. చిన్న హోదా కావడం వల్ల పెళ్లయిన తర్వాత అల్లుడు దేహైని ఆమెకు పదోన్నతి ఇచ్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్ సీమా బయట పెట్టడంతో కొత్త పెళ్లికొడుకు ఇప్పుడు ఇరుక్కున పడ్డారు.

read also : మహిళల బ్లౌజులపై సింగర్ చిన్మయి వివాదాస్పద వాక్యాలు

Visitors Are Also Reading