ఏపీ రిజిస్ట్రేషన్, ఎమ్మార్వో ఆఫీసుల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. పలువురు అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 9,355 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 57,410 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Advertisement
నిజామాబాద్ తెలంగాణ వర్సిటీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వైస్ ఛాన్స్‌లర్ రవీందర్‌పై ఏసీబీ విచారణకు తీర్మానం ప్రకటించింది. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌పై వేటు పడింది.
విశాఖ పెందుర్తిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. బ్రోకర్ల చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు.. బాధితుడితో రూ.8.5 లక్షలకు బ్రోకర్ల ఒప్పందం చేసుకున్నారు. బాధితుడు ఆస్పత్రిలో ఉండగానే ఆర్థిక లావాదేవీలు జరిగాయి. రూ.5లక్షలు బ్రోకర్లు వీడియో రికార్డు చేశారు.
Advertisement
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దంతెవాడలో ఏపీ, తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా అన్నారంలో ఘరానా మోసం జరిగింది. జిన్‌సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల కుచ్చుటోపి విధించారు. ఆయిల్ సరఫరా చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని అమాయకులకు గాలం విసిరారు. ఆయిల్ కోసం నరహరి అనే వ్యక్తి రూ.1.76 కోట్లు చెల్లించాడు.
తిరుమలలో 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,382 మంది భక్తులు దర్శించుకున్నారు.
నేటి నుంచి 3 రోజుల పాటు తిరుపతి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. ఒంటిమిట్ట, అమీన్‌పీర్ దర్గాను ఆయన సందర్శించనున్నారు. రేపు శ్రీవెంకటేశ్వర వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.