ఆదాయ వనరుల సముపార్జన శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మాన, కొట్టు సత్యనారాయణ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Advertisement
రాజధాని అమరావతిలో R5 జోన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ ప్రారంభం అయ్యింది.
ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. దుండగుడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం తో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
భారత్‌లో గత 24 గంటల్లో 11,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వివేకా హత్య కేసులో సీబీఐ కార్యాలయంలో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. వరుసగా మూడో రోజు అవినాష్ రెడ్డి విచారణ విచారణ కొనసాగుతోంది.
Advertisement
నేడు జూనియర్ లెక్చరర్ సంఘాలతో విద్యా శాఖ మంత్రి బొత్స సమావేశం నిర్వహించారు. జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన సమస్యలపై సమావేశం లో చర్చించనున్నారు.
వైఎస్ వివేకా హ* కేసులో చంచల్‌గూడ జైలు నుండి వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్‌లను కస్టడీలోకి తీసుకుని సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఇద్దరిని మూడో రోజు సీబీఐ ప్రశ్నించనుంది.
తిరుమలలో 6 కంపార్టుమెంట్లలో భక్తులు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 56,680 మంది భక్తులు దర్శించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో భారీ ఈదురు గాలులు,
ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం కురిసంది. అకాల వర్షానికి రైతులు నష్టపోతున్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం ప్రజలనుంచి విరాళాల సేకరణకు అనుమతి ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేఖ రాశారు.