కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు 10వ తరగతి పరీక్షలు జరుగలేదు. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి రాకూడదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించకుండా ఈ సారి 80 శాతానికి సిలబస్‌ను కుదించారు. మారిన ఫిజిక్స్ సిలబస్‌కు సంబంధించిన వివరాలను ఓసారి చూసుకోండి. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ ప్రశ్న పత్రంలో మొత్తం నాలుగు విభాగాలుంటాయి.
అందులో మొదటి విభాగంలో 12 ప్రశ్నలు హాఫ్ మార్కు ప్రశ్నలుంటాయి. బిట్స్ వలే ఉంటాయి ఇవి. ఇవి మొత్తం రాస్తే ఆరు మార్కులు వస్తాయి. రెండవ విభాగంలో ఎనిమిది ప్రశ్నలుంటాయి. ఇవి ఒక మార్కు ప్రశ్నలు వీటికి ఒక మాటలో జవాబు రాయవలెను. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి. మొదటి, రెండవ విభాగం మొత్తం పరీక్షలు రాస్తే 20 మార్కులు వస్తాయి.
Advertisement
Advertisement
ఇక నాలుగవ విభాగంలో 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక అవకాశముంటుంది. ఈ విభాగంలో వ్యాసరూప ప్రశ్నలు లేదా డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా పదోతరగతి విద్యార్థులు ఫిజికల్ సైన్స్ లో మంచి మార్కులు సాధించడానికి పరమాణు నమూనా, మూలకాల ఆవర్తన పట్టిక, లోహ సంగ్రహణ శాస్త్రం, డ్రాయింగ్స్ వంటి వాటిపై దృష్టి సారించండి. వీటి నుంచి మంచి స్కోరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read :
గ్రూప్-1 పోస్టుల కేటాయింపుపై మీకు డౌట్ ఉంటే ఈ విషయాలు తెలుసుకోండి..!
రాజమౌళి- మహేష్ బాబు సినిమాలో సచిన్ కూతురు..!