Home » గర్భీణీ స్త్రీలకు శుభవార్త.. ఇక నుంచి ఆ వైద్య సేవలు ఉచితం..!

గర్భీణీ స్త్రీలకు శుభవార్త.. ఇక నుంచి ఆ వైద్య సేవలు ఉచితం..!

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  గర్భీణీలకు ఓ శుభవార్త చెప్పింది. పేదవారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఇప్పటికే గర్భిణీలకు, బాలింతలకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద పలు సరుకులను అందిస్తోంది ప్రభుత్వం. అయితే జూలై 1 నుంచి సరుకులను నేరుగా వారి ఇంటికే సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రాలలో అందిస్తున్న సరుకులను జూలై 1 నుంచి నేరుగా గర్భిణీలు బాలింతలకు ఇంటికే వెళ్ళనున్నాయి.  బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు, నూనె, అటుకులు, బెల్లము, ఎండు ఖర్జూర వంటి సరుకులను పంపిస్తున్నారు.

Advertisement

తాజాగా ఏపీ ప్రభుత్వం గర్భిణీలకు వైద్య సేవలను ఉచితంగానే అందిస్తోంది. గర్భిణీల కోసం ఉచితంగా అత్యాధునిక టార్గెట్ ఇమేజింగ్ ఫర్ పీతల ఎనామలై స్కానింగ్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గర్భిణీలు 18 నుంచి 22 వారాల దశలో తిప్పా స్కానింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పిండం ఎదుగుదలలో ఏమైనా లోపాలుంటే టిపా స్కానింగ్ చేయించుకోవడం వల్ల ఆ లోపాలు తెలుస్తాయి. ఈ స్కానింగ్ కి రూ.1100 ఖర్చవుతుంది. అయితే దీనిని ప్రభుత్వమే భరిస్తుంది.

Advertisement

అదేవిధంగా  ఆల్ట్రా సానోగ్రామ్ స్కానింగ్ కి రూ.250 చొప్పున ప్రభుత్వం భరిస్తుంది. ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆస్పత్రులలో ఈ టిప్పా స్కానింగ్ ఉచితంగా నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేద, మధ్యతరగతి గర్భిణీ స్త్రీలకు ఒక టిపా స్కానింగ్, రెండు అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్లు ఫ్రీగా చేస్తారు. గత ఏడాది ఆరోగ్యశ్రీ కార్డు కింద 2.31 లక్షల మంది గర్భిణీలు ప్రసవసేవలు పొందారు. ఫిఫా అల్ట్రా సోలోగ్రామ్ స్కానింగ్ అవసరమైన విధానాలు ఆన్లైన్లో పొందుపరిచినట్టు ఆరోగ్యశ్రీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వస్తున్న ఈ సేవలను గర్భిణీ స్త్రీలు ఆన్లైన్లో నమోదు చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో తమ రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చిన స్టార్స్ వీరే..!

విడాకుల తర్వాత సమంత గురించి మొదటిసారి ప్రస్తావించిన చైతూ… ఆమెలో నాకు నచ్చేది అదే..!

 

Visitors Are Also Reading