సాధారణంగా టాలీవుడ్ స్వీటీ అనగానే అభిమానులకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు అనుష్క శెట్టి. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలను చేస్తూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. 40 ఏళ్ల వయస్సు దాటిపోయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఈమెపై గతంలో పలు రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో లేడీ ఓరియెంట్స్ మూవీస్ అంటే అనుష్కనే గుర్తుకొస్తుంది. ముఖ్యంగా అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అనుష్క గురించి గతంలో నాగార్జున, ప్రభాస్ గురించి పలు రూమర్స్ వచ్చాయి. ఇటీవలే నాగార్జున కుమారుడు నాగచైతన్యతో అనుష్క పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయం పై నాగార్జున స్పందించి కాస్త సీరియస్ అయ్యారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉంటే ఓ స్టార్ క్రికెటర్ తో అనుష్క పెళ్లి అనే వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె క్రికెటర్ తో పెళ్లికి సిద్ధమైనట్టు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పుకున్నారని ఆ కథనాల్లో వెల్లడించారు. ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం క్లారిటీగా తెలియదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!