Home » ఆ బడా నిర్మాతతోనే అనుష్కపెళ్ళి..!

ఆ బడా నిర్మాతతోనే అనుష్కపెళ్ళి..!

by Sravya
Ad

అనుష్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఎప్పటికీ అలా నిలిచిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో అనుష్క కూడా ఒకరు. అనుష్క శెట్టి చాలా ఏళ్లుగా టాలీవుడ్ లో సందడి చేస్తోంది ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. తాజాగా అనుష్క శెట్టి పెళ్లి గురించి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ మూవీ తో అనుష్క తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చింది. తర్వాత తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

తన కెరియర్ ప్రారంభంలోనే చాలా సినిమాలో నటించింది ఆమె స్థాయిని పెంచినవి కూడా ఉన్నాయి. వాటిలో ముందు చెప్పుకోవాల్సిందే అరుంధతి మూవీ. ఇందులో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. తర్వాత బాహుబలి తో ఈమె వరల్డ్ మొత్తంలో ఫేమస్ అయిపోయింది. దీంతో అనుష్క రేంజ్ బాగా పెరిగింది. బాహుబలి మూవీ షూటింగ్ అప్పుడు సైజ్ జీరో లో నటించింది.

Also read:

Advertisement

Also read:

ఇందులో లావు ఉన్న అమ్మాయిగా కనపడడానికి బాగా బరువు పెరిగింది. తర్వాత మళ్ళీ తగ్గింది. ఇప్పుడు అనుష్క ఘాటీ మూవీలో నటిస్తుందని విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉందని అనేక పుకార్లు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం అనుష్క పెళ్లి విషయం నెట్టింట వైరల్ అవుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాతతో అనుష్క పెళ్లికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలు లో నిజం ఎంత అనేది తెలియాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading